Homeక్రీడలుRohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు.. బీసీసీఐ సంచలన ప్రకటన.!

Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు.. బీసీసీఐ సంచలన ప్రకటన.!

Rohit Sharma: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తర్వాత భారత జట్టు ఆటగాళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓటమి తర్వాత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, దీనిపై బీసీసీఐ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రస్తుతం అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాభవం దక్కించుకుంది. ఆస్ట్రేలియా జట్టు చేతిలో 200కుపైగా పరుగులు తేడాతో ఇండియా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత భారత్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కీలక ప్లేయర్లపై గతంలో ఎన్నడూ లేని విధంగా ముప్పేట దాడి జరుగుతోంది. ఒకపక్క అభిమానులు, మరోపక్క మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పెద్ద ఎత్తున ఆటగాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక జట్టులోని ఆటగాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందని ప్రచారం జరిగింది. అందులో భాగంగానే జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీని తొలగిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై బీసీసీఐ తాజాగా ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేసింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆటగాడిగా, కెప్టెన్ గా విఫలమైన రోహిత్ శర్మపై బీసీసీఐ వేటు వేస్తుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే రోహిత్ శర్మ కూడా సైలెంట్ గా ఉండడంతో అదే నిజమని అంతా భావిస్తూ వచ్చారు. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ లోను ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 26 బంతులాడిన రోహిత్ శర్మ 15 పరుగులు మాత్రమే చేయగా, రెండో ఇన్నింగ్స్ లో కొంత మెరుగుపడి 60 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేశాడు. అయితే, మ్యాచ్ కు జట్టు ఎంపిక, కీలక సమయాల్లో బౌలర్ల మార్పు వంటి విషయాల్లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దారుణమైన ఓటమి తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది.

కెప్టెన్సీ తొలగింపుపై స్పష్టతను ఇచ్చిన బీసీసీఐ..

రోహిత్ శర్మ కెప్టెన్ గా తొలగిస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తొలగిస్తున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ ఖండించింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీకి తక్షణం వచ్చిన ముప్పు ఏమీ లేదని తేలిపోయింది. అయితే, వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ పై రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆధారపడి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చూడాలి వెస్టిండీస్ పర్యటనలో అయినా రోహిత్ శర్మ తన వ్యక్తిగత ప్రదర్శనతోపాటు జట్టు ప్రదర్శనను గాడిలో పెడతాడా లేదో.

Exit mobile version