Rohit Sharma : మెస్సి కూడా దిగదుడుపే.. ఏం నడిచావ్ రోహిత్ భయ్యా.. మైండ్ లో నుంచి పోవడం లేదు..

Rohit Sharma టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మెస్సిని అనుకరించాడు. విభిన్నంగా నడుచుకుంటూ వచ్చి.. జై షా చేతుల నుంచి ట్రోఫీని అందుకున్నాడు.

Written By: NARESH, Updated On : July 1, 2024 2:43 pm

rohit-sharma-lionel-messi-celebr

Follow us on

Rohit Sharma : టి20 వరల్డ్ కప్ ను టీం ఇండియా గెలుచుకొని దాదాపు మూడు రోజులవుతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఇవే వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఆడిన ఆట తీరు, వ్యవహరించిన తీరు, కప్ అందుకున్నప్పుడు నడిచిన తీరు ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కప్ అందుకునేటప్పుడు నడిచిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

2022లో ఖతార్ వేదికగా ఫిఫా ఫుట్ బాల్ టోర్నీ జరిగింది. ఫైనల్ లో ఫ్రాన్స్ – అర్జెంటీనా తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా విజయం సాధించింది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా గోల్స్ చేసి.. ఆ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనా ఫిఫా కప్ విజేతగా ఆవిర్భవించింది. ట్రోఫీ స్వీకరించే సమయంలో మెస్సీ విభిన్నంగా నడుచుకుంటూ వచ్చి అందుకున్నాడు. ఇది అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది.

టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మెస్సిని అనుకరించాడు. విభిన్నంగా నడుచుకుంటూ వచ్చి.. జై షా చేతుల నుంచి ట్రోఫీని అందుకున్నాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు. వాస్తవానికి ఈ సాంప్రదాయానికి మెస్సి శ్రీకారం చుట్టినప్పటికీ.. అతడిని మించి పోయేలా రోహిత్ అనుకరించాడు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. గత మూడు రోజుల నుంచి టాప్ లో కొనసాగుతోంది.

ఇక హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి తన స్టామినా నిరూపించుకున్నాడు. 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 169 పరుగులు మాత్రమే చేయగలిగింది.. టీమిండియా బౌలర్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. విరాట్ 76 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు.