Rohit Sharma: అరేయ్.. వెకిలి ఆస్ట్రేలియన్లూ.. చూడండ్రా.. ఇదీ క్రికెట్ పై మా కెప్టెన్ కు ఉన్న ప్రేమ..

Rohit Sharma: 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మ అమాంతం మైదానంపై పడుకున్నాడు. కుడి చేత్తో సాధించాం అన్నట్టుగా.. మూడు గట్టి నాక్స్ ఇచ్చాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 1, 2024 2:54 pm

Rohit Sharma eats sand from Barbados pitch after Team India victory

Follow us on

Rohit Sharma: 2023 వన్డే వరల్డ్ కప్.. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా – ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. దురదృష్టవశాత్తు టీమిండియా ఆ మ్యాచ్లో ఓడిపోయింది. రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమవుతూ మైదానాన్ని వీడాడు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా వెకిలి చేష్టలకు పాల్పడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై రెండు కాళ్లు పెట్టి ఫోటోకు ఫోజిచ్చాడు. ఇది సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయింది. చాలామంది ఆస్ట్రేలియా ఆటగాడిపై దుమ్మెత్తి పోశారు. “కళ్ళు ఏమైనా నెత్తికెక్కాయా?” అంటూ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ ను, కెప్టెన్ ను ఆ జట్టు మేనేజ్మెంట్, మీడియా వెనకేసుకొచ్చింది.

ఇక 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మ అమాంతం మైదానంపై పడుకున్నాడు. కుడి చేత్తో సాధించాం అన్నట్టుగా.. మూడు గట్టి నాక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బార్బడోస్ మైదానంపై భారత జెండాను పాతాడు. మైదానం లోని అవుట్ ఫీల్డ్ పై ఉన్న గడ్డిని తిన్నాడు.. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలను ఒక ఊపు ఊపుతున్నాయి.” రోహిత్ కు క్రికెట్ అంటే ప్రాణం. అతడు ఆటను ప్రేమిస్తాడు. అందువల్లే ఉద్వేగానికి గురయ్యాడు. చాలామంది దృష్టిలో టి20 వరల్డ్ కప్ అంటే ఒక టోర్నీ మాత్రమే. టీమిండియాను విశ్వవిజేతగా నిలిపేందుకు అతడు ఎంతగానో కష్టపడ్డాడు. ఆ కష్టం ఫలించడం వల్లే.. ఇలా స్పందిస్తున్నాడని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో గత వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ వ్యవహరించిన తీరును ఉదహరిస్తున్నారు. ” రేయ్ కంగారూలు.. ఆటను ప్రేమించడం అంటే ఇది.. ఆటను ఇష్టపడమంటే ఇది. మీ దృష్టిలో కప్ పైన కాళ్లు పెడతారు. మా కెప్టెన్ మాత్రం మైదానంలో జాతీయ జెండాను పాతుతాడు. సాధించిన విజయానికి గుర్తుగా.. అపూర్వ గెలుపును అందించిన మైదానాన్ని స్మరించుకుంటూ.. అక్కడ ఉన్న గడ్డిని తిన్నాడు.. అంటే మైదానంతో పోల్చుకుంటే నేను నిమిత్తమాత్రుడిని.. నా జట్టు కూడా నిమిత్తమాత్రం అని నిరూపించాడు.. ఇప్పటికైనా చూసి నేర్చుకోండి” అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే టీమ్ ఇండియా ను వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడించిన తర్వాత.. ఆ జట్టు ఆటగాళ్లు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. మైదానంలో పిచ్చిపిచ్చిగా అరిచారు. ఇది అప్పట్లో టీమ్ ఇండియా అభిమానులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇదే సమయంలో టి20 వరల్డ్ కప్ గ్రూప్ -8 స్టేజీలో టీమిండియా ఆస్ట్రేలియాపై గెలవడంతో.. భారత అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది. వారు పెట్టిన కామెంట్లు, చేసిన పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది.. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లను ట్రోల్ చేస్తూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేశారు. దాదాపు నాలుగు రోజుల దాకా ఆ తరహా పోస్టులే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.