Rohit Sharma: మైదానంలో ఉన్నప్పుడు మాత్రం రోహిత్ శర్మ ఆగ్రహంగానే ఉంటాడు. ఎవరైనా ఫీల్డర్ క్యాచ్ మిస్ చేస్తే.. బౌలర్ భారీగా పరుగులు ఇస్తే.. తోటి ఆటగాడు సరిగ్గా పరుగులు చేయకపోతే గట్టిగా అరుస్తాడు. కానీ అరుదైన సందర్భంలో మాత్రమే రోహిత్ తనలో ఉన్న కామెడీని బయటికి తీస్తాడు. ఒక్కోసారి తోటి ఆటగాళ్లపై అరుస్తూ కూడా అందులో కామెడీ పండిస్తాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రిషబ్ పంత్ క్యాచ్ మిస్ చేస్తే.. ” ఏరా కళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లో పెట్టి వచ్చావా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ క్యాచ్ మిస్ చేయడంతో.. రోహిత్ శర్మ మైదానంలో తన చేతిని పదేపదే గుద్దాడు.. హ్యాట్రిక్ మిస్ చేసినందుకు అక్షర పటేల్ కు సారీ కూడా చెప్పాడు. అతడికి మంచి ట్రీట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు..
Also Read: ఐపీఎల్ లో అన్ సోల్డ్.. కేఎల్ రాహుల్ నమ్మకం ఉంచాడు..కరణ్ నాయర్ కం బ్యాక్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ!
ఐకానిక్ మూమెంట్స్
ఆదివారం ఢిల్లీ జట్టుతో ఢిల్లీ మైదానంలో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ దూకుడు చూపించలేదు.. ఏమాత్రం ఆకట్టుకునే విధంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ సమయంలో అతడు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యాడు. ఇటీవల గాయపడిన నేపథ్యంలో ఒక మ్యాచ్ కు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తర్వాత మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ రోహిత్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆదివారం తీవ్ర ఉత్కంఠ మధ్య ముంబై జట్టు గెలిచిన తర్వాత.. మైదానంలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో కరణ్ నాయర్ దంచి కొట్టాడు.. మైదానంలో విధ్వంసాన్ని సృష్టించాడు. ఒక రకంగా బుమ్రా కు నిద్రలేని రాత్రిని పరిచయం చేశాడు. చివర్లో ముంబై జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసింది.. ఫీల్డింగ్ కూడా అదే విధంగా చేసింది.. ముగ్గురు ఢిల్లీ ఆటగాళ్ళను రనౌట్ గా పెవిలియన్ పంపించింది.. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబై జట్టు మ్యాచ్ వైపు మొగ్గింది. మొత్తంగా గెలుపు అత్యంత అవసరమైన సందర్భంలో ముంబై విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై జట్టు కెప్టెన్, బుమ్రాకు కరణ్ నాయర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే బుమ్రా అంతగా స్పందించలేదు. హార్దిక్ పాండ్యా మాత్రం తనదైన శైలిలో స్పందించాడు. అయితే దూరం నుంచి ఇదంతా చూస్తున్న రోహిత్ శర్మ.. తనదైన స్టైల్ లో ముఖాన్ని తిప్పాడు. ఇది చూసే వాళ్లకు ఐకానిక్ మూమెంట్ లాగా కనిపించింది. ” చూస్తున్నా.. అన్ని చూస్తున్నా.. మీరు చేస్తున్నవన్నీ గమనిస్తున్నా” అన్నట్టుగా రోహిత్ శర్మ హావభావాలు ఉన్నాయని ముంబై ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ” రోహిత్ చూపించిన ముఖ భావాలు సోషల్ మీడియా రీల్స్ కు తగ్గ మెటీరియల్ లాగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేస్తే మిలియన్స్ లైక్స్ సాధ్యమని” ముంబై అభిమానులు పేర్కొంటున్నారు.
THE REACTION OF ROHIT SHARMA DURING THIS WAS ICONIC. pic.twitter.com/L7G2fPWwAW
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025