India Vs New Zealand Semi Final: టాస్ కూడా ఫిక్సింగ్ అంట.. ఇండియా గెలుపును జీర్ణించుకోలేకపోతున్న పాక్ ఆటగాళ్లు…

ఇండియన్ టీం మీద ఎప్పుడు విషాన్ని కక్కుతూ మన ఇండియా విజయాన్ని ఓర్వలేక మనమీద ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండే పాకిస్తాన్ దేశంలోని కొంతమంది మాజీ ప్లేయర్లు మాత్రం బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇ

Written By: Gopi, Updated On : November 16, 2023 3:05 pm

India Vs New Zealand Semi Final

Follow us on

India Vs New Zealand Semi Final: ఇక నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సమీఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ గొప్ప విజయాన్ని సాధించి ఫైనల్ కి చేరుకుంది…అయితే న్యూజిలాండ్ టీమ్ మీద కూడా మన వాళ్ళు మామూలుగా గెలవలేదు చాలావరకు కష్టపడాల్సి వచ్చింది. మొదట మన బ్యాట్స్ మెన్స్ తమదైన రీతిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే బౌలర్లు దాన్ని కంటిన్యూ చేస్తూ తమ సత్తా చాటారు. మహమ్మద్ షమీ మాత్రం ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి వరల్డ్ కప్ లో ఎవరికి సాధ్యం కానీ విధంగా ఒక రికార్డ్ ను నెలకొల్పాడు….

అయితే ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపుని సెలబ్రేట్ చేస్తూ, ప్రపంచ దేశాల దిగ్గజ క్రికెటర్లు సైతం ఇండియన్ టీమ్ చాలా గొప్ప విజయాన్ని సాధించింది అంటూ చాలా గొప్పగా చెప్తుంటే మన ఇండియన్ టీం మీద ఎప్పుడు విషాన్ని కక్కుతూ మన ఇండియా విజయాన్ని ఓర్వలేక మనమీద ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండే పాకిస్తాన్ దేశంలోని కొంతమంది మాజీ ప్లేయర్లు మాత్రం బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇండియా విజయం మీద కూడా చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. అది ఏంటి అంటే బిసిసిఐ కుట్రలో భాగంగానే ఇండియన్ టీం టాస్ గెలుస్తుంది అంతే తప్ప ఇండియన్ టీమ్ ఒరిజినల్ గా మ్యాచ్ లు ఆడడం లేదు. టాస్ ఫిక్సింగ్ చేస్తూ మ్యాచ్ లు గెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

ఇక ఇప్పటికీ హసన్ రజా అనే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ఇండియన్ టీమ్ ని ఉద్దేశించి ఐసీసీ ఇండియన్ టీం కి ప్రత్యేకమైన బాల్స్ ఇస్తుంది.అందుకే వాళ్ళు అత్యుత్తమమైన ప్రదర్శన కనబరుస్తు అలా వికెట్లు తీయగలుగుతున్నారు అంటూ ఒక కామెంట్ చేశాడు. ఇక దానిమీద చాలా మంది ఇండియన్ సీనియర్ ప్లేయర్ స్పందించి హసన్ రజాకి బుద్ధొచ్చినట్టుగా మాట్లాడారు.అయితే ఇప్పుడు సెమీఫైనల్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ మరో మాజీ ఆటగాడు అయిన సికిందర్ బఖ్త్ ఇండియన్ టీమ్ టాస్ లో ఫిక్సింగ్ చేస్తుంది అంటూ కామెంట్లు చేశాడు…

అది విన్న చాలా మంది టాస్ లో ఫిక్సింగ్ చేయడం ఏంటి అని ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి టాస్ విషయంలో ఎవరు కూడా ఫిక్సింగ్ అనేది చేయరు.ఇక ఈ పాకిస్తాన్ ప్లేయర్ కి ఉన్న నాలెడ్జి ప్రకారం ఆయన చెప్పేది ఏంటి అంటే టాస్ వేసే టైంలో రోహిత్ శర్మ తో పాటు గా న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ ఉన్నాడు అయితే రోహిత్ మాత్రం టాస్ ని ఇక్కడే వేయకుండా వీళ్ళకి కొంచం దూరం లో గాల్లోకి ఎగరేస్తున్నాడు దాంతో అది అక్కడ కాకుండా వేరే చోట పడుతుంది.ఆ ఫీల్డ్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి వెళ్లి ఆ కాయిన్ ని చూసి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు అని చెప్తున్నాడు. అయితే ఆ టాస్ ఏం పడింది అనేది ప్రత్యర్థి జట్టు కి కూడా చూపించడం లేదు దాన్ని వీడియో కూడా తీసి ఎక్కడ పెట్టడం లేదు. ఇక ఆ ఫీల్డ్ లో టాస్ ఎవరు గెలిచారు అనే చెప్పే వ్యక్తి కూడా బిసిసిఐ కి సంభందించిన వ్యక్తి కూడా బీసీసీఐ కనుసన్నల్లోనే నడిచేవాడు కాబట్టి ఆయన కూడా ఆపోజిట్ ఏది చెప్తే అది పడకుండా రోహిత్ టాస్ గెలిచినట్టు గా చెప్తూన్నాడు అంటూ పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సికిందర్ భఖ్త్ కామెంట్ చేస్తున్నాడు…

ఇది చూసిన చాలామంది ఇండియన్ జనాలు పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు అయిన వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ లాంటి వాళ్ళు ఇండియన్ టీమ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే వీళ్ళు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ప్లేయర్లకి ఆట సరిగా ఆడటం రాదు కానీ బాగా ఆడే వాళ్లని మాత్రం విమర్శించడంలో ఎప్పుడు ముందు వరుస లో ఉంటారు. అలాగే మ్యాచ్ కి ముందు మేము అది చేస్తాం ఇది చూస్తామని మ్యాచ్ కి ముందే ప్రగల్భాలు పలుకుతూ మ్యాచ్ లో మాత్రం ఏది చేయలేక చతికిల పడుతూ ఉంటారు…

అయితే దీనిపైన మరి కొందరు స్పందిస్తూ రోహిత్ టాస్ దూరం గా వేశాడు అంటున్నావ్ మరి అఫ్గాన్ తో మ్యాచ్ లో బాబర్ అజమ్ కూడా టాస్ దూరం గా వేశాడు కదా ఆ మ్యాచ్ లో కూడా మీరే టాస్ గెలిచారు కదా దానికి ఏం సమాధానం చెప్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీకు ఆడటం చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి కానీ గెలిచిన టీం పైన నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం బాగుండదు అని ఇండియన్ క్రికెట్ అభిమానులు వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు…