Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ – సందీప్ మాస్టర్ బెస్ట్ ఫ్రెండ్స్. హౌస్ లో ఉన్నంత వరకు ఇద్దరు కలిసి గేమ్ ఆడుతూ .. ఒకే మాట మీద ఉండేవారు. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం అమర్ దీప్ వల్ల తన గేమ్ పాడైందని షాకింగ్ కామెంట్స్ చేశారు సందీప్ మాస్టర్. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన కొడుకు మంచోడు .. ఇప్పుడు చెడ్డోడైపోయాడా అంటూ ప్రశ్నించారు అమర్ దీప్ తల్లి రూప.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. అమర్ వల్ల నా గేమ్ దెబ్బతిందని సందీప్ మాస్టర్ అంటున్నారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. హౌస్ ఉన్నంత వరకు బానే కలిసి ఆడారు. ఇద్దరూ ఫ్రెండ్స్ గా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారంటే ఈయన్ని ఏమనాలో తెలియడం లేదు. ఆయన బయటకు వచ్చాక అమర్ దీప్ గురించి మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది.
ప్రశాంత్ ని రా రా పోరా అంటున్నాడంటే .. స్నేహితుడని అనుకున్నాడు కాబట్టి ఆలా పిలుస్తున్నాడు. అంతే తప్ప గర్వమో ఇంకేదో కాదు. స్నేహం కోసం ప్రాణం ఇస్తాడు అమర్ దీప్. వారానికి ఒక్క సారి వచ్చే నాగార్జున గారైన అమర్ దీప్ ఆటను గుర్తిస్తున్నారు. కానీ… 24 గంటలు పక్కనే ఉండే శివాజీ గారు గుర్తించడం లేదు. అమర్ దీప్ కి శివాజీ ఇష్టం కానీ… ఆయనకి అమర్ దీప్ అంటే ఇష్టం ఉండదు.
శివాజీ గారి పై ఉన్న అభిమానంతో అమర్ దీప్ తనకి సపోర్ట్ గా నిలుస్తారని అనుకున్నాడు. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత వీళ్ళకి పడలేదు. ఇప్పుడు శివాజీ గారు అర్థం చేసుకున్నారు. అందుకే ఎంకరేజ్ చేస్తున్నారు. టాలెంట్ ఉండి కూడా అమర్ సరిగా ఆడటంలేదు. నీ బలం నీకు తెలియడం లేదు అని శివాజీ కూడా చాలా సార్లు అన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోలేక పోవడం వల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు అమర్ దీప్ తల్లి రూప.