Rohit Sharma: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన సారథిగా రోహిత్ శర్మ కు పేరుంది. ముంబై జట్టును అతడు ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అయితే అంతటి నాయకుడిని ముంబై జట్టు యాజమాన్యం 2024 సీజన్ నుంచి పక్కన పెట్టింది. సాధారణ ప్లేయర్ గా మాత్రమే పరిమితం చేసింది.. అయినప్పటికీ రోహిత్ శర్మ అద్భుతంగానే ఆడుతున్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. గత సీజన్లో ముంబై జట్టు అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సీజన్లో మాత్రం అదరగొట్టింది. ఏకంగా ప్లే ఆఫ్ దాకా వెళ్ళిపోయింది.
Also Read: వద్దన్నా.. జెమీమానే గెలిపించింది.. గుండెలు బరువెక్కించే కథ ఇది
రోహిత్ శర్మ ముంబై జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఓపెనర్‌గా పరుగుల వరద పారిస్తున్నాడు. అటువంటి రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై జట్టు నుంచి వెళ్ళిపోతున్నాడని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఏకంగా రోహిత్ శర్మ క్విట్ ముంబై టీం అనే యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ముంబై జట్టు యాజమాన్యం తీరుతో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడని.. అందువల్లే జట్టు నుంచి వెళ్ళిపోతున్నాడని.. అతడిని కొనుగోలు చేయడానికి మిగతా యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధాన మీడియాలో ఎటువంటి వార్తలు రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇదంతా నిజమేనని చాలామంది భావించారు. అయితే దీనిపై చివరికి ముంబై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
ముంబై జట్టు నుంచి వచ్చే ఐపిఎల్ సీజన్లో రోహిత్ వెళ్లిపోతాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. దానికి చెక్ పెట్టేందుకు ముంబై యాజమాన్యం రంగంలోకి దిగింది. ఊహగానాలకు బ్రేక్ వేస్తూ సరికొత్త నిర్ణయాన్ని వెల్లడించింది.. ఈ ప్రకారం ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ బయటికి వెళ్లిపోవడం యాజమాన్యం ప్రకటించింది. సూర్యుడు తిరిగి ఉదయిస్తాడని అనే క్యాప్షన్ జతచేస్తూ రోహిత్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ముంబై జట్టు నుంచి రోహిత్ వెళ్లిపోవడని తేలిపోయింది.
రోహిత్ ఇటీవలి సీజన్లో అదరగొట్టాడు. సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అటువంటి రోహిత్ జట్టు నుంచి వెళ్ళిపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని మేనేజ్మెంట్ కు తెలుసు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రోహిత్ లేని ముంబై జట్టును ఊహించుకోవడం కష్టమని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. 2024లో రోహిత్ ను కెప్టెన్ గా పక్కకు తప్పించినప్పుడు అభిమానులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో దారుణంగా ప్రచారం చేశారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముంబై జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.