Eye Contact Children And Parents: నేటి కాలంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఫలితంగా వారి జీవితం పై ప్రభావం పడి భవిష్యత్తులో వారు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. పిల్లల వయసులోనే తమ తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటించడం వల్ల పెద్దయ్యాక వారి మనసులో చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. అలాగే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కొన్ని త్యాగాలు చేయడం వల్ల కూడా వారికి మంచి భవిష్యత్తును ఇచ్చిన వారవుతారు. ముఖ్యంగా కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం పిల్లలతో ఐ టు ఐ కాంట్రాక్టు చేయాలని అంటున్నారు. అసలు ఈ ఐ టు ఐ కాంటాక్ట్ అంటే ఏమిటి? దీనివల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు ఎలాంటి ప్రయోజనకరం?
Also Read: వద్దన్నా.. జెమీమానే గెలిపించింది.. గుండెలు బరువెక్కించే కథ ఇది
ఒక కుటుంబంలోని పిల్లవాడు స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులకు తమ స్కూలులోని విషయాలను చెబుతూ ఉంటాడు. అలా చెబుతూ ఉంటే తల్లి లేదా తండ్రి నిలబడి ఉంటుంది. కానీ పిల్లవాడు మాత్రం పైకి చూస్తూ తన విషయాలను చెబుతూ ఉంటాడు. అయితే పిల్లవాడు చెప్పే విషయాలు తల్లి లేదా తండ్రికి నచ్చనప్పుడు వారిస్తూ ఉంటారు. అలాగే వారు చెప్పింది విని కామ్ గా ఉంటారు. అంతేకాకుండా వారు పైకి చూడడం వల్ల పేరెంట్స్ కిందికి చూడడం వల్ల వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. అంటే వారు చెప్పేది తమ పేరెంట్స్ వినడం లేదనే భావన వారిలో కలుగుతుంది. ఇలాంటి అప్పుడు తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్య విధి ఏంటి అంటే.. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు మోకాలు మంచి అంటే కింద కూర్చున్నట్టు.. వారితో సమానంగా ఉండి వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ వారు చెప్పేది పూర్తిగా వినాలి. ఒకవేళ వారు చెప్పిన దాంట్లో ఏవైనా సమస్యలు ఉంటే ఇవి తప్పు.. లేదా ఒప్పు సరిదిద్దాలి. అంటే పిల్లలతో సమానంగా వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి వారితో మాట్లాడటం వల్ల తల్లిదండ్రులకు కనెక్ట్ అయిపోతారు.
ఇలా చేయడం వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకునే వారిలా అవుతారు. అలా కాకుండా వారికి ఎదురుగా నిలబడి వారించడం.. లేదా వారు చెప్పింది వినకపోవడం.. లేదా వారు దగ్గరికి వచ్చి చెప్తే దూరంగా పెట్టడం వంటివి చేయడం వల్ల వారి మనసులో చెడు భావాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో వారు మరోసారి కొన్ని విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగి ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోలేక పోతారు.
అంతేకాకుండా పిల్లలు ఏ విషయాలు చెప్పిన పూర్తిగా వినాలి. ఆ తర్వాతే మాట్లాడాలి. వారు చెప్పే విషయాన్ని మధ్యలో ఆపివేయడం వల్ల కూడా వారు తీవ్ర నిరాశ చెందే అవకాశం ఉంటుంది. అలా వారిని పూర్తిగా మాట్లాడడం ఇవ్వడం అంటే వారికి స్వేచ్ఛ ఇవ్వడం అన్నట్లే. ఈ విషయంలో కనుక తల్లిదండ్రులు సరైన పద్ధతులు పాటిస్తే తవ పిల్లల భవిష్యత్తుతో పాటు వారు కూడా మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు.