Sabarimala Ayyappa Temple 18 Steps: మొన్న శబరిమల ఆలయంలో బంగారం మాయమైందని వార్తలు వచ్చాయి. ఆలయంలోని కొన్ని విగ్రహాలను సరికొత్త ఆకృతి పేరుతో వేరే వ్యక్తులు తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన క్రమంలో బంగారాన్ని మాయం చేశారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేరళ రాష్ట్రంలో రాజకీయంగా గొడవ కూడా మొదలైంది. అధికార, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ వివాదం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వివాదం ఎలా ఉన్నా.. శబరిమల 18 మెట్ల ప్రాధాన్యం ఎంతో గొప్పది.
Also Read: లోక్ సభ, అసెంబ్లీ నియోజక వర్గాలు జిల్లాల స్వరూపాన్ని ఎందుకు నిర్ణయించలేవు?
ప్రస్తుతం కార్తీక మాసం. ఇది శివకేశవులకు ఎంత ప్రీతిపాత్రమైనది. ఈ క్రమంలో భక్తులు అయ్యప్ప మాలధారణ చేస్తుంటారు. 41 రోజులపాటు అత్యంత కఠినంగా దీక్ష చేస్తుంటారు. ఇరుముడి ధరించి 18 మెట్లు ఎక్కుతుంటారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ దీక్షను పూర్తి చేస్తారు. ఈ 18 మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తుంటారు. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ఈ 18 మెట్లు పరుశురాముడు నిర్మించాడని చెబుతుంటారు. పౌరాణిక కథల ఆధారంగా ముల్లోకాలకు నరకం చూపిస్తున్న మహిషి అనే రాక్షసుడిని సంహరించడానికి అయ్యప్ప స్వామి అవతరించాడని.. ఆ రాక్షసుడిని అంతం చేసిన తర్వాత తనను పెంచి పెద్ద చేసిన పందలం రాజుకు తాను శబరి కొండపై కొలువు తీరబోతున్నట్టు వెల్లడిస్తాడు. ఆ స్వామి అత్యున్నత స్థాయిలో ఆసీనుడు అవ్వడానికి వీలుగా చతుర్వేదాలు, ఆరు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు 18 మెట్లుగా ఏర్పడ్డారు. అయ్యప్ప స్వామి తన పాదాలను వాటి మీద మోపుతాడు. పట్ట బందాసనంలో కూర్చొని యోగ ముద్ర లో స్వామి వారు దర్శనమిస్తారు. అంతేకాదు జ్యోతి రూపంలో అంతర్ధానం అవుతుంటారు.
18 మెట్లలో మొదటి మెట్టు మహంకాళి, రెండవ మెట్టు కలింకాళి, మూడవ మెట్టు భైరవ, నాలుగవ మెట్టు సుబ్రహ్మణ్య, ఐదవ మెట్టు గంధర్వ రాజా, ఆరవ మెట్టు కార్తవీర్యా, ఏడవ మెట్టు కృష్ణ పింగళి, ఎనిమిదో మెట్టు బేతాళ, 9వ మెట్టు నాగరాజా, పదవ మెట్టు కర్ణ, 11వ మెట్టు వైశాఖ, 12వ మెట్టు పులిందిని, 13వ మెట్టు రేణుకా పరమేశ్వరి, 14వ మెట్టు స్వప్న వారాహి, 15వ మెట్టు ప్రత్యంగిరా, 16వ మెట్టు నాగ యక్షిణి, 17వ మెట్టు మహిషాసుర మర్దిని, 18వ మెట్టు అన్నపూర్ణేశ్వరి.. ఇలా దేవతామూర్తులు ఒక్కో మెట్టుకు అధిష్టాన దేవతలుగా ఉంటారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది.
18 మెట్లకు కూడా రకరకాల పేర్లు ఉన్నాయి 1, అనిమ, 2, లగిమ, 3, మహిమ, 4, ప్రాప్తి, 5, ప్రాకామ్య, 6, వసిత్వ, 7, ఈ శత్వా, 8, ఇచ్చా, 9, బుద్ధి, 10, సర్వకామ, 11, సర్వసంపత్కర, 12, సర్వ ప్రియాంకరా, 13, సర్వ మంగళకర, 14, సర్వదుఃఖ విమోచన, 15, సర్వ మృత్యు ప్రసమన, 16, సర్వ విగ్న నివారణ, 17, సర్వాంగ సుందర, 18, సర్వ సౌభాగ్యదాయక.. అనే పేర్లు పెట్టారు.