Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: రోహిత్ నో చెప్పాడు.. ముంబై దిక్కులేని జట్టు అయిపోయింది..

Rohit Sharma: రోహిత్ నో చెప్పాడు.. ముంబై దిక్కులేని జట్టు అయిపోయింది..

Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మకు ఉన్న నాయకత్వ పటిమను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.. ముంబై ఇండియన్స్ జట్టును అతడేకంగా ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అయితే విజయాలు సాధించినప్పుడు రోహిత్ శర్మను భుజాల మీదకు ఎత్తుకున్న మేనేజ్మెంట్.. ఓటములు ఎదురైనప్పుడు అదే స్థాయిలో కింద పడేసింది. అంతేకాదు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కనపెట్టింది. అతడిని ఒక ఆటగాడిగా పరిమితం చేసింది.

2024 సీజన్లో రోహిత్ సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. ఆ సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు సారధిగా అవతరించాడు. అతని నాయకత్వంలో ముంబై జట్టు గొప్పగా విజయాలు సాధించలేదు. ఆ సీజన్లో చివరి స్థానానికి పరిమితమైంది. 2025లో ప్లే ఆఫ్ దాకా వచ్చినప్పటికీ
.. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు అంత గొప్పగా ఆడటంలేదు. ఈ సీజన్లో వరుసగా ఓటములతో ముంబై జట్టు తన ప్రస్తానాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వలేమి ఆ జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారింది.

ముంబై సారధిగా హార్దిక్ పాండ్యా ఇటీవల మ్యాచ్లో కనిపించలేదు. జట్టుకు తాత్కాలిక సారధిగా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లేదు. సూర్య కుమార్ యాదవ్ కూడా వ్యక్తిగత కారణాలవల్ల తదుపరి మ్యాచ్ కు అతడు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు తదుపరి మ్యాచ్ కు సారధిగా వ్యవహరించేది ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది.

జట్టుకు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను మేనేజ్మెంట్ సంప్రదించింది. దానికి అతడు సున్నితంగా తిరస్కరించాడు.. ఒకసారి వదిలేసుకున్న దానిని మళ్లీ ఎలా పట్టుకుంటానంటూ ఆయన మేనేజ్మెంట్ కు సంకేతాలు ఇచ్చాడు. దీంతో మేనేజ్మెంట్ కు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టుకు నాయకత్వం ఎవరు వహిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వ్యక్తమౌతోంది. అయితే ఇప్పుడు ముంబై జట్టుకు నాయకత్వం వహించేది ఎవరో తెలియాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version