Rohit Sharma: వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ తన అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తూ వరుసగా తొమ్మిది విజయాలను అందుకుంది. యుద్ద చేసే వాడికి తెలుసు గెలుపు ఎంత కఠినంగా ఉంటుంది అని,కానీ యుద్ధంలో గెలిచినవాడు చెప్పే మాట ఒకటే పోరాటంలో నిజాయితీ ఉంటే గెలుపు ఎప్పుడు నీ ముందు బానిసలా మోకరిల్లాల్సిందే అని…
ఇక ప్రస్తుతం ఇండియన్ టీం పరిస్థితి కూడా అలానే ఉంది. ఇండియన్ టీమ్ ఆడే ఆట ముందు ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్య పోయి ఇండియన్ టీమ్ ను శభాష్ అనడం తప్ప మరేం చేయలేకపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా తొమ్మిది విజయాలను అందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు దానికి గొప్ప స్ట్రాటజీ ఉండాలి. గొప్ప నాయకుడు ముందుండి టీం ని నడిపించాలి. అంతకుమించి మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ప్లేయర్లు ప్రత్యర్థులను స్ట్రాంగ్ గా ఎదురుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఇంతటి ఘనవిజయాలను సాధించుకోవడం సాధ్యమవుతుంది.ఇక ఇలాంటి క్రమంలో ఇండియా వీటన్నింటిని దాటుకొని చిటికెన వేలితో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టు ప్రత్యర్థి టీం ని చిటికెన వేలుతో ఓడిస్తూ చాలా ఈజీగా మ్యాచ్ లు గెలుచుకుంటూ వస్తుంది.
ఇక బలమైన జట్లని సైతం 100 పరుగుల లోపు, లేదా 200 పరుగుల లోపే కట్టడి చేసి వరుస విజయాలను అందుకున్న ఇండియన్ టీం సెమీ ఫైనల్, ఫైనల్ లో గెలిచి వరల్డ్ కప్ ను సాధించి 130 కోట్ల మంది జనాలకి అంకితం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ క్రమంలో నెదర్లాండ్స్ పైన మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇండియా విజయ రహస్యం ఏంటి అనేదానిమీద స్పందించాడు…
మా టీం యొక్క విజయ రహస్యం పెద్దగా ఏమీ లేదు మేము ఎవరితో అయితే మ్యాచ్ ఆడబోతున్నామో ఆ టీమ్ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది తెలుసుకొని దాని మీద మనం ఎలా పోరాడాలి అనే దాని మీద మాత్రమే దృష్టిని పెట్టాం దాన్ని అమలు చేస్తూ విజయాలు కూడా సాధిస్తూ వస్తున్నాం. ఇక మీదట కూడా మేం ఇలాంటి స్ట్రాటజీ ని ఫాలో అవుతునే విజయం సాధించాలి…ఇక ఇలా ఓపెన్ గా తను నమ్మిన స్ట్రాటజీని రోహిత్ బయటికి చెప్తూనే, ఈ క్రమంలో మా ప్లేయర్లు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ లు ఇస్తూ అద్భుతాలను క్రియేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మా బ్యాట్స్ మెన్స్ అయితే చేజింగ్ సమయంలో వీరుల్లా రెచ్చిపోతున్నారు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మా బ్యాట్స్ మెన్స్ చేసిన పరుగులకు బౌలర్లు కూడా అద్భుతమైన బౌలింగ్ స్ట్రాటజీని చూపిస్తూ విజయాలను అందిస్తున్నారు. అలాగే మా పేస్ బౌలర్లు అయితే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ పైన విరుచుకుపడి వాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు…
ఇక దీనికి తగ్గట్టుగానే మా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ప్లేయర్స్ అందరి మధ్య కో ఆర్డినేషన్ సూపర్ గా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండటం కూడా మా విజయానికి మరో రహస్యమని చెప్పారు. ఇక అలాగే ఈ మ్యాచ్ లో తను బౌలింగ్ వేయడం మీద కూడా స్పందిస్తూ కొన్ని సందర్భాల్లో టీం కి బౌలర్లు అవసరమైనప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేయాలి అందులో భాగంగానే నేను, కోహ్లీ బౌలింగ్ చేశాం అని నవ్వుతూ చెప్పాడు…