spot_img
Homeఎంటర్టైన్మెంట్Chandra Mohan-NTR: చంద్ర మోహన్ కి పెద్ద ఎన్టీయార్ కి మధ్య గొడవ ఏంటి..?

Chandra Mohan-NTR: చంద్ర మోహన్ కి పెద్ద ఎన్టీయార్ కి మధ్య గొడవ ఏంటి..?

Chandra Mohan-NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటులలో చంద్రమోహన్ గారు ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మొదట్లో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన అనంతర కాలం తో పాటు మార్పు చెందుతూ ఆ తర్వాత సెకండ్ హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత తండ్రి పాత్రలను పోషిస్తూ విభిన్న పాత్రల్లో తనదైన మార్క్ చూపిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడిగా ముందుకు దూసుకెళ్లాడు. నిజానికి ఆయన స్టార్ హీరో రేంజ్ దాకా వెళ్లి స్టార్ హీరో అవ్వలేక మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఇలా ఆయన గురించి మనం ఎంత మాట్లాడకుండా తక్కువే అవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఆయన అనారోగ్య పరిస్థితి వల్ల మనందరినీ వదిలేసి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు…

ఇక చంద్ర మోహన్ గారు గురించి చెప్పాలి అంటే ఆయన చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. ఒకసారి చంద్రమోహన్ గారితో నటిస్తే ప్రతి హీరోయిన్ కూడా టాప్ పొజిషన్ లోకి వెళుతుంది అనే మాటలు ఇండస్ట్రీ లో అప్పట్లో బాగా వినిపించేవి… దాదాపుగా ఈయన 45 మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు అందులో చాలామంది స్టార్ హీరోయిన్స్ గా కూడా ఎదిగారు. అయితే ఈయన స్టార్ హీరోగా ఎదిగే క్రమంలో ఎన్టీయార్ గారికి ఈయనకి మధ్య గొడవలు జరగడం వల్లే ఈయన స్టార్ హీరోగా ఎదగలేకపోయారని చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కి ఆయన కి మధ్య జరిగిన గొడవ ఏంటి ఎందుకు జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా చేయడానికి ఎన్టీయార్ ఫిక్స్ అయి అందులో బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ ని చంద్రమోహన్ తో చేయించాలి అనుకున్నారు. దానికి అనుగుణంగానే చంద్రమోహన్ గారికి ఆ క్యారెక్టర్ గురించి ఎక్స్ ప్లెయిన్ చేస్తే దానికి సంబంధించిన క్యారెక్టర్ లో చేయడానికి ఆయన తన బాడీ ని ఫిట్ గా చేసుకుని,ఒక వన్ మంత్ డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశారు.ఇక తీరా సమయానికి చంద్రమోహన్ గారికి చెప్పకుండా ఆ క్యారెక్టర్ లో ఎన్టీయార్ బాలయ్య బాబు ని తీసుకున్నారు. ఇక ఈ విషయం తెలియకుండా మేనేజర్ చెప్పిన రోజు, చెప్పిన టైంకి చంద్ర మోహన్ షూటింగ్ లోకేషన్ వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో బాలకృష్ణ గారితో ఆ సినిమా షూటింగ్ చేస్తున్నారు.అది చూసిన చంద్రమోహన్ కోపానికి గురై అక్కడ జరిగిన విషయం తెలుసుకుని అక్కడ్నుంచి కోపంతో ఇంటికి వచ్చేశారు.

ఇక అప్పుడు విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వాళ్ళ మేనేజర్ ని పంపించి మీరేం బాధపడకండి నెక్స్ట్ ఇంకొక సినిమాలో ఎన్టీఆర్ గారు మీకు మంచి ఛాన్స్ ఇస్తారంట అని చెప్పమన్నారు దాంతో మేనేజర్ వెళ్లి అలాగే చెప్పాడు అలా చెబితే అప్పుడు చంద్రమోహన్ ఆయన ఇచ్చే ఛాన్స్ ఎవరికి కావాలి, అయిన మినిమం రెస్పాన్సిబులిటీ లేకుండా ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ కి చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ కోసం మరొకరిని ఎలా తీసుకుంటారు అంటూ తన రచ్చ రచ్చ చేశాడు.

దాంతో ఆ విషయం ఎన్టీఆర్ కి కూడా తెలిసింది. ఇక అప్పటి నుంచి చంద్రమోహన్ కి హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి చంద్రమోహన్ కి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది దానివల్లే ఆయన హీరోగా కూడా ఎక్కువ రోజులు రాణించలేదని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version