Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: పొమ్మన లేక రోహిత్ శర్మకు పొగ పెడుతున్నారా..

Rohit Sharma: పొమ్మన లేక రోహిత్ శర్మకు పొగ పెడుతున్నారా..

Rohit Sharma: రోహిత్ శర్మ విషయంలో ఏం జరుగుతోంది.. ఇంతకీ అతడు లార్డ్స్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే ద్వారా క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్తాడా.. అతడి కుటుంబ సభ్యులు అందుకోసమే లార్డ్స్ కు వచ్చారా.. అసలు ఏం జరుగుతోంది.. కొన్ని మీడియా ఛానల్స్ ఏమో రోహిత్ క్రికెట్ మొత్తానికి గుడ్ బై చెప్తాడు.. 2027 వన్డే వరల్డ్ కప్ లో అతడికి మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వదు.. ఇదే విషయాన్ని చెప్పేసింది.. అందువల్లే రోహిత్ నిర్ణయం తీసుకున్నాడని వార్తలను ప్రసారం చేస్తున్నాయి. కాకపోతే ఈ విషయాల మీద అటు బీసీసీఐ గాని.. ఇటు రోహిత్ శర్మ గాని అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు…

ప్రఖ్యాత స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్ క్రిక్బజ్ నివేదిక ప్రకారం ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ శర్మ.. సెలెక్టర్లకు మధ్య జరిగిన చర్చలు ఇప్పటివి కావని.. అవి గతంలో ఉన్న చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున ఆడటం తన కల అని అనేక సందర్భాల్లో రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాదు ఆ విషయంలో తాను వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. వాస్తవానికి ఈ విషయంలో సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు.. హెడ్ కోచ్ గౌతం గంభీర్ ధోరణి రోహిత్ శర్మకు ఏమాత్రం నచ్చడం లేదని సమాచారం. ఒకవేళ లార్డ్స్ పండే తర్వాత రిటైర్ అయితే కచ్చితంగా అది రోహిత్ సొంత నిర్ణయం కాకపోవచ్చు అని క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది.

2027 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున ఆడాలని అనేక రకాలుగా రోహిత్ శర్మ ప్రయత్నాల మొదలు పెట్టాడు. ముఖ్యంగా వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడానికి తన బరువును పూర్తిగా తగ్గించుకున్నాడు. బ్యాటింగ్ లోపాలను సవరించుకున్నాడు. బ్యాటింగ్ మీద పూర్తిగా దృష్టిపెట్టాడు. అందువల్లే ఆస్ట్రేలియా సిరీస్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో తన స్థాయి ఆట కొనసాగించలేకపోయినప్పటికీ.. పరుగులు తీయడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని కనపరచలేదు.

ఇంగ్లాండ్ సిరీస్లో రోహిత్ శర్మ అంత గొప్పగా ఆడలేక పోయినప్పటికీ.. అతడు ఉంటే చాలు తోటి ప్లేయర్లకు ధైర్యం ఉంటుంది.. అందువల్లే తొలి వన్డేలో టీమ్ ఇండియాలో గెలిచింది. రెండవ వన్డేలో రోహిత్ విరాట్ తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నిర్మించాడు.. అయితే అతడు అనుకోని పరిస్థితిలో అవుట్ కావడంతో జట్టు ఇబ్బందులలో పడింది. ఒకవేళ అతడు నిలబడి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. యంగ్ ప్లేయర్లు ప్రస్తుత జట్టులో చాలామంది ఉన్నారు. వారిలో ఎవరు కూడా రోహిత్ లాగా డేరింగ్ బ్యాటింగ్ చేయలేరు.

2027 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు తరుపున యంగ్ ప్లేయర్లు మాత్రమే కాదు.. అనుభవం ఉన్న రోహిత్ లాంటి వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే రోహిత్ శర్మకు దక్షిణాఫ్రికా మైదానాలు కొట్టినపిండి. పైగా అతడు విధ్వంసానికి పర్యాయపదంలాగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని జట్టుకు దూరం చేస్తే.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే గౌతమ్ సూర్య కుమార్ యాదవ్ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ అర్థమవుతూనే ఉంది. రోహిత్ శర్మ విషయంలో కూడా గౌతమ్ గంభీర్ ఇలానే చేస్తే పర్యావసనాలు కూడా అదే విధంగా ఉంటాయేమో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular