Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Wife: పవన్ కళ్యాణ్ కోసం ఎవరు చేయని సాహసం చేసిన భార్య...

Pawan Kalyan Wife: పవన్ కళ్యాణ్ కోసం ఎవరు చేయని సాహసం చేసిన భార్య లెజినోవా.. వైరల్ వీడియో

Pawan Kalyan Wife: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే ముంబై లో చాలా కాలం నుండి బాధపడుతున్న భుజాల నొప్పి కి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేయించుకోవాలని అనుకున్నారు కానీ , నొప్పి భరించలేనంత ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో కేవలం కుడి భుజానికి ఒక్కటే సర్జరీ చేయించుకున్నారు. 3 వారాల విశ్రాంతి అవసరమని , […]

Pawan Kalyan Wife: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే ముంబై లో చాలా కాలం నుండి బాధపడుతున్న భుజాల నొప్పి కి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేయించుకోవాలని అనుకున్నారు కానీ , నొప్పి భరించలేనంత ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో కేవలం కుడి భుజానికి ఒక్కటే సర్జరీ చేయించుకున్నారు. 3 వారాల విశ్రాంతి అవసరమని , ఆ తర్వాత ప్రతీ రోజు ఫిజియో థెరఫీ చేయించుకోవాలని , సాధారణ పరిస్థితి కి భుజాలు రావడానికి 4 నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారట. నాలుగు నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ చేస్తామని అన్నారట డాక్టర్లు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు , తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా , తన భర్త త్వరగా కోలుకోవాలని అలిపిరి తిరుమల మెట్లు ఎక్కుతూ శ్రీవారిని దర్శించుకునే కార్యక్రమం తలపెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. 2024 వ సంవత్సరం లో కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని ఒక స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురై తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆ సమయంలో అన్నా లెజినోవా తల్లిగా ఎంత ఆందోళనకు గురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సమయం లో శ్రీవారిని తన బిడ్డని రక్షించమని మొక్కుకున్న అన్నా లెజినోవా , సురక్షితంగా బయటపడడం తో శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు అర్పించడమే కాకుండా, అన్నదానం కూడా చేసింది. అప్పట్లో ఈ వీడియో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా లో ఆమె పవన్ కోసం తిరుమల మెట్లు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. తన మతం కాకపోయినా , భర్త మతాన్ని , ఆయన ఆచారాలను స్వీకరించి , అవి తూచా తప్పకుండ అనుసరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా చేసినందుకు ప్రతీ ఒక్కరు అన్నా లెజినోవా ని మెచ్చుకుంటున్నారు నెటిజెన్స్. తాను పుట్టిన మతాన్ని పూజిస్తూ, భర్త మతాన్ని గౌరవిస్తూ , భారతీయ సంస్కృతి ని అనుసరిస్తున్న ఇలాంటి మహిళను ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన మతాన్ని పూజించు , పర మతాలను గౌరవించు అనే సిద్ధాంతాన్ని ఈమె నుండి నేర్చుకోవాలి.

 

View this post on Instagram

 

A post shared by A Ajay (@_anubhavinchu_raja_)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper