Rohit Sharma: 2024 టి 20 వరల్డ్ కప్ కి రోహిత్ ఔటా..? మరి కోహ్లీ పరిస్థితి ఏంటి..?

ఇక యంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతున్న ఈ మ్యాచ్ లో మన ప్లేయర్లందరు తమదైన రీతిలో రాణించి నెక్స్ట్ ఇయర్ జరిగే టి 20 వరల్డ్ కప్ కి ఇప్పటి నుంచే పునాది వెయ్యాలని చూస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : November 23, 2023 1:37 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: ప్రస్తుతం ఇండియన్ టీం వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కొంతవరకు నిరుత్సాహంలో ఉంది. అయినప్పటికీ ఇవాళ్ల ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో ఇండియన్ టీం అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మళ్లీ ఇండియన్ క్రికెట్ అభిమానులలో జోష్ నింపాలని చూస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం భారీ అంచనాలతో సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియా తో ఆడే 5 టి20 సీరీస్ ల్లో బాగంగా ఈ రోజు మొదటి మ్యాచ్ ని ఆడటానికి రెఢీ అయింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఇండియన్ టీమ్ అభిమానులను కొంతవరకు ఆనందపరచాలనే ఉద్దేశ్యం లో ఇండియన్ టీమ్ ప్లేయర్లు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు…

ఇక యంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతున్న ఈ మ్యాచ్ లో మన ప్లేయర్లందరు తమదైన రీతిలో రాణించి నెక్స్ట్ ఇయర్ జరిగే టి 20 వరల్డ్ కప్ కి ఇప్పటి నుంచే పునాది వెయ్యాలని చూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే గత టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత నుంచి టీంలో రోహిత్ శర్మ గాని, విరాట్ కోహ్లీ గాని టి20 మ్యాచ్ లు ఆడడం లేదు. వాళ్ల ఫోకస్ మొత్తం వన్డే వరల్డ్ కప్ మీద పెట్టీ టి20 మ్యాచ్ లను యంగ్ ప్లేయర్లకి వదిలేశారు. ఇక ఈ క్రమంలో ఇండియా రీసెంట్ గా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చి ఓడిపోయింది. కాబట్టి ఇక నెక్స్ట్ ఇయర్ జరిగే టి20 వరల్డ్ కప్ పోటీలో మన టీమ్ తన సత్తాని చూపించాలి అంటే ఇప్పటినుంచే టి20కి సంబంధించిన ప్రణాళికలను రచిస్తూ ముందుకెళ్లాలి.

అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టీ20 వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అనేది కూడా ఆసక్తిని కల్గిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రోహిత్ శర్మ టి20 మ్యాచ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే 36 సంవత్సరాలు ఉన్న రోహిత్ టి 20 కి దూరంగా ఉంటూ యంగ్ ప్లేయర్లకి అవకాశాలు ఇస్తున్నాడు. ఇంతకు ముందు మన చీఫ్‌ సెలక్టర్‌ అయిన అజిత్‌ అగార్కర్‌తో అతను చర్చించిన తర్వాత తాను టీ20లకు దూరంగా ఉండాలని రోహిత్‌ నిర్ణయించుకున్నాడు.

ఇది పూర్తిగా అతడి నిర్ణయమే అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.అయితే ఇక మీదట మనం రోహిత్ ని టి 20 ల్లో చూడటం కష్టమే…ఇక మరొక ప్లేయర్ అయిన కోహ్లీ ఫిట్ గా ఉన్నప్పటికీ తను టి 20 వరల్డ్ కప్ ఆడతాడా లేదా అనేది అతని వ్యక్తిగత అభిప్రాయం మీదనే డిపెండ్ అయి ఉంది…