తెలంగాణలో ఒక సందర్భంలో బీజేపీ పని అయిపోయిందనుకున్నారు. కర్ణాటకల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం.. కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకపోవడం.. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మార్చడంతో అందరూ తెలంగాణలో ఇక బీజేపీకి ఛాన్స్ లేదని.. బీఆర్ఎస్ తో అది కలిసిపోయిందని ప్రచారం చేశారు. కాంగ్రెస్ దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.
ఇవన్నీ చూసేసి తెలంగాణలో బీజేపీ ఇక లేదని.. పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అనుకూల సంస్థలు, మీడియా, సర్వేలు, సోషల్ మీడియా అన్నీ కూడా బీజేపీ పోటీలో లేదు అని తేల్చేశారు. కాంగ్రెస్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యింది.
తెలంగాణ, ఆంధ్రలో బీజేపీ వ్యతిరేక ఎకోసిస్టమ్ బాగా ప్రచారంలోకి వెళ్లింది. కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు అసలు పరిస్థితులు వేరు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా అవినీతి బాగా జరిగింది. దీన్ని అక్కడి కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇక అక్కడ సిద్ధరామయ్య లాంటి బలమైన నేత కాంగ్రెస్ కు అండగా ఉన్నారు. ఇక లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్పను బీజేపీ తొలగించడం కూడా ఆ పార్టీకి మైనస్ గా మారింది. అయితే ఇప్పుడు మోడీ రాక.. తెలంగాణలో బీజేపీ ప్రచారం చూశాక పరిస్థితులు మారాయి.
బీజేపీ వ్యూహాల ముందు ప్రతికూల పరిస్థితులు బలాదూర్ అయ్యాయని.. తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.