Rohit Sharma: ఇండియన్ క్రికెట్ టీం లో దిగ్గజ ప్లేయర్ గా గుర్తింపు పొందడమే కాకుండా ప్రస్తుతం ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా కీలక బాధ్యతను వహిస్తున్న “రోహిత్ శర్మ” గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. ఇక ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఆయన ప్రస్తుతం ముంబై ఇండియన్ టీం లో ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్ లో తనదైన రీతిలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ ముంబై ఇండియన్స్ టీం విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం తను ఐపీఎల్ తర్వాత జరగబోయే “టి20 వరల్డ్ కప్” లో కూడా కెప్టెన్ గా చాలా కీలక బాధ్యతలను కొనసాగించబోతున్నాడు అని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియజేశాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన బ్యాటింగ్ లో కూడా మంచి ఫామ్ లో ఉండడం, టి20 వరల్డ్ కప్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా “బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్” కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ తన రిటైర్ మెంట్ గురించి తన సాధించబోయే వాటి గురించి చాలా కీలక వ్యాఖ్యలు చేశాడు…
“ఇప్పుడప్పుడే నాకు రిటర్మెంట్ ప్రకటించాలనే ఉద్దేశం లేదని, కానీ అన్ని రోజులు మన చేతిలో ఉంటాయనే గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి నా వరకైతే రిటర్మెంట్ ప్రకటించే అవకాశం లేదు అని తన స్పష్టంగా చెబుతూనే, ప్రస్తుతం నా వయసు 36 సంవత్సరాలు నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నా వరకు ఇండియాకి ఇంకొక వరల్డ్ కప్ ని అందించాలి. అలాగే “ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్” 2025 లో ఎలాగైనా సరే ఇండియన్ టీం కి కప్పుని అందించాలి. ప్రస్తుతానికి నేనైతే చాలా ఫిట్ గా ఉన్నాను. అలాగే బ్యాటింగ్ కూడా బాగా ఆడుతున్నాను”. కాబట్టి ఇప్పుడప్పుడే నేను రిటర్ మెంట్ ప్రకటించే అవకాశం అయితే లేదని రోహిత్ శర్మ చాలా స్పష్టంగా తెలియజేశాడు…
ఇక ఈ కార్యక్రమంలో ఇంకా మాట్లాడుతూ నా వరకు అత్యుత్తమమైన టోర్నీ అంటే వన్డే వరల్డ్ కప్ మాత్రమే ఎందుకంటే మేమంతా 50 ఓవర్ల మ్యాచ్ లు చూసుకుంటూ పెరిగాం. కాబట్టి మా దృష్టిలో వరల్డ్ కప్ మాత్రమే చాలా గొప్పది. అందువల్లే ఇండియాకి ఇంకొక వరల్డ్ కప్ రావాలని కోరుకుంటున్నాను. 2023వ సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అత్యుత్తమమైన పర్ఫామెన్స్ ని ఇచ్చి టీమ్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లినప్పటికీ, ఒక అడుగు దూరం లో మేము మ్యాచ్ ఓడిపోవడం అనేది నిజంగా మాకు కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.
ఇక దాంతో కొద్దిరోజుల వరకు ఏం చేయాలో కూడా నాకు ఏమీ తోచలేదు. ఫైనల్ లో మేము ఆడిన ఆట తీరు బాగానే ఉంది. అయినప్పటికీ అన్ని రోజులు మనవే ఉండవు కదా అనే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకుంటే మంచిదని ఆరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత నాకు అనిపించింది. ఇక ఆరోజు మేము ఆడిన దానికంటే కొంచెం బెటర్ గా ఆస్ట్రేలియా టీం పర్ఫామెన్స్ ఇవ్వడం తో వాళ్లకు వరల్డ్ కప్ దక్కింది. మేము మరి అంత చెత్త పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు అంటూ రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…