Virat Rohit IND vs PAK : విరాట్ కోహ్లీని భుజాలపై ఎత్తుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ రెండు కళ్లు చాల్లేదు.. వీడియో

IND vs PAK Virat Rohit  పాకిస్తాన్ తో మ్యాచ్ ను గెలిపించి విరాట్ కోహ్లీ వీరుడిగా నిలిచాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతాన్ని సృష్టించాడు. కిస్తాన్ పై ఇండియా గెలుస్తుందని స్టేడియంలోని వ్యక్తులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. భారతీయులు కూడా నమ్మలేదు.. కానీ ఒక్కడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను గెలిపించాడు. కడవరకూ ఉండి మరీ భారత్ కు విజయాన్ని అందించాడు. అతడే విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 […]

Written By: NARESH, Updated On : October 23, 2022 8:57 pm
Follow us on

IND vs PAK Virat Rohit  పాకిస్తాన్ తో మ్యాచ్ ను గెలిపించి విరాట్ కోహ్లీ వీరుడిగా నిలిచాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతాన్ని సృష్టించాడు. కిస్తాన్ పై ఇండియా గెలుస్తుందని స్టేడియంలోని వ్యక్తులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. భారతీయులు కూడా నమ్మలేదు.. కానీ ఒక్కడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను గెలిపించాడు. కడవరకూ ఉండి మరీ భారత్ కు విజయాన్ని అందించాడు. అతడే విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి చివరివరకూ ఉండి భారత్ ను గెలిపించాడు. హార్ధిక్ పాండ్యా(40)తో కలిసి శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను చివరి వరకూ క్రీజులో ఉండి గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు

పాకిస్తాన్ మీద అపూర్వవిజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కళ్లు చెమర్చాయి. పాక్ పై గెలిపించిన ఆనందంలో విరాట్ మైదానంలోనే ఏడ్చేశాడు. ఇక ఇండియాను గెలిపించిన విరాట్ ను కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చి మరీ తన భుజాలపై ఎత్తుకొని గిరిగిర పైకి తిప్పాడు. అనంతరం ఆనందంతో గట్టిగా హత్తుకున్నాడు.

ఒకనొక సమయంలో కోహ్లీ కెప్టెన్సీ పోవడానికి రోహిత్ కారణమని.. వీరి మధ్య కోల్డ్ వార్ కూడా జరిగింది. ద్రావిడ్ కోచ్ అయ్యాక కోహ్లీని పలు సిరీస్ లకు పక్కనపెట్టారు. అనంతరం ఆసియాకప్ లో సెంచరీ కొట్టి ఫాంలోకి వచ్చిన కోహ్లీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా ఆడాడు. ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో 5.3 ఓవర్లకే.. 31-4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను గెలిపించాడు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కోహ్లీని రోహిత్ ఇలా ఎత్తుకొని విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూసి ఇండియా ఫ్యాన్స్ మైమరిచిపోయారు. ఇది కదా అనుబంధం అంటే.. ఇది కదా? భారత జట్టుకు కావాల్సింది అని అందరూ ఆనందపడ్డారు. వారిద్దరిని అలా సాన్నిహిత్యంగా.. అన్యోన్యంగా చూసి హర్షం వ్యక్తం చేశారు. విరాట్, రోహిత్ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇండియా ఫ్యాన్స్ కి నిజంగానే దీపావళి పండుగగా ఉంది.