Virat Rohit: విరాట్ కోహ్లీ ఫాం కోల్పోవడంపై రోహిత్ శర్మ హాట్ కామెంట్స్

Virat Rohit: ఇన్నాళ్లు అతడి కెప్టెన్సీలో ఆడాడు. విరాట్ కోహ్లీ టైం అయిపోవడంతో లక్కీగా కెప్టెన్ అయ్యాడు.అయితే అవ్వడంతో వివాదాలతో వార్తల్లో నిలిచాడు. కోహ్లీ కెప్టెన్సీ వదులుకునేందుకు ససేమిరా అనడం.. బలవంతంగా బీసీసీఐ పక్కనపెట్టడం.. రోహిత్ ను కెప్టెన్ చేయడం వరుసగా జరిగిపోయింది. నిజానికి కోహ్లీ పేలవ ఫామ్ కారణంగా.. అతడి కెప్టెన్సీ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్లే ఆ పదవిని కోల్పోయాడు. ఈ క్రమంలోనే కోహ్లీ సెంచరీ చేయక రెండేళ్లు అవుతోంది. కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. […]

Written By: NARESH, Updated On : February 15, 2022 4:14 pm
Follow us on

Virat Rohit: ఇన్నాళ్లు అతడి కెప్టెన్సీలో ఆడాడు. విరాట్ కోహ్లీ టైం అయిపోవడంతో లక్కీగా కెప్టెన్ అయ్యాడు.అయితే అవ్వడంతో వివాదాలతో వార్తల్లో నిలిచాడు. కోహ్లీ కెప్టెన్సీ వదులుకునేందుకు ససేమిరా అనడం.. బలవంతంగా బీసీసీఐ పక్కనపెట్టడం.. రోహిత్ ను కెప్టెన్ చేయడం వరుసగా జరిగిపోయింది. నిజానికి కోహ్లీ పేలవ ఫామ్ కారణంగా.. అతడి కెప్టెన్సీ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్లే ఆ పదవిని కోల్పోయాడు.

ఈ క్రమంలోనే కోహ్లీ సెంచరీ చేయక రెండేళ్లు అవుతోంది. కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టీమిండియా కొత్త కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు ఇదే ప్రవ్న ఎదురైంది. విరాట్ ఫామ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రోహిత్ ను సూటిగా విలేకరులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మీడియాపై కోహ్లీ సీరియస్ అయ్యాడు.

కోహ్లీ ఫామ్ గురించి అస్సలు ఆందోళన వద్దని రోహిత్ వెనకేసుకురావడం విశేషంగా మారింది. నిజానికి వీళ్లద్దరి మధ్య విభేదాలున్నాయని.. రోహిత్ ను కెప్టెన్ కాకుండా కోహ్లీ అడ్డుకున్నాడని ప్రచారం సాగింది. కానీ రోహిత్ మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా కోహ్లీ ఖచ్చితంగా రాణిస్తాడని.. మీడియా వార్తల వల్లే అతడి ఫామ్ పై చర్చ సాగుతోందని.. మీరు కొన్నాళ్లు మౌనంగా ఉంటే అంతా సర్దుకుంటుందని వెనకేసుకొచ్చాడు.

కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ లో చాలా అనుభవం ఉంది. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కోహ్లీకి బాగా తెలుసు. అందుకే విఫలమైన కూడా కోహ్లీ గత ఆటను చూసి రోహిత్ యే కాదు.. క్రికెట్ మేధావులు శంకించడం లేదు.

అయితే అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ సెంచరీ చేసి రెండేళ్లకు పైగా అవుతోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.