Rohith Sharma : ఐదుసార్లు ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలిచిన ముంబై.. ఈ సీజన్లో ప్లే ఆఫ్ వెళ్లకుండా.. ఇంటిదారి పట్టిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటకట్టుకుంది. శుక్రవారం రాత్రి కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై 24 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను మొత్తం నాశనం చేసుకుంది. అద్భుతాలు జరిగితే తప్ప ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేదు.
శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 19.5 ఓవర్లలో 169 రన్స్ చేసింది. వెంకటేష్ అయ్యర్ 70, మనీష్ పాండే 42 రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, కోయేట్జీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 145 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. సూర్య కుమార్ యాదవ్ (56) మాత్రమే పరవాలేదనిపించాడు. స్టార్క్ నాలుగు వికెట్లు పడగొట్టి, ముంబై జట్టు పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్లో ముంబై తుది జట్టులో రోహిత్ శర్మకు అవకాశం లభించలేదు. లక్ష్యాన్ని చేదించే క్రమంలో అతడు ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానం లోకి వచ్చాడు. దీంతో స్పోర్ట్స్ సర్కిల్స్ లో రకరకాల చర్చలు జరిగాయి. హార్దిక్ పాండ్యా రోహిత్ స్థానానికి అసలుకే ఎసరు పెట్టాడా? మిగతా మ్యాచ్ లకు దూరం చేశాడా? అనే ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి.. దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని ముంబై ఆటగాడు పియూష్ చావ్లా బయట పెట్టాడు..
వాస్తవానికి రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడట. దీనివల్ల అతడిని ముంబై జట్టు యాజమాన్యం ఫీల్డింగ్ కు దూరంగా ఉంచిదట. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో.. ముందస్తుగా జాగ్రత్తగా అతనికి రెస్ట్ ఇచ్చారట. అంతేకాదు ఐపీఎల్ లో మిగతా మ్యాచ్లకు రోహిత్ అందుబాటులో ఉండడట.. అయితే ఈ నొప్పి తేలికపాటిదని, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పియూష్ చావ్లా చెబుతున్నాడు. త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని, రోహిత్ కు విశ్రాంతి ఇచ్చారట. ఈ సమయంలో రోహిత్ కనక మైదానంలోకి అడుగుపెడితే.. టి20 వరల్డ్ కప్ కు దూరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి.. ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుందట.