Rohit Sharma
Rohit Sharma : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తిరుగులేని విజయాల చరిత్రను అందించిన ఘనత ముమ్మాటికి రోహిత్ (Rohit Sharma) దే. బ్యాటింగ్ తో ఆకట్టుకుని.. జట్టు కూర్పులో తనదైన మార్క్ చూపించి.. అందరి నోట ప్రశంసలు అందుకునేవాడు రోహిత్ శర్మ. రోహిత్ ముంబై జట్టుకు ప్రాణం పెట్టాడు. ముంబై జట్టును విజేతగా నిలపడంలో తది వరకు కృషి చేశాడు. అందువల్లే ముంబై జట్టు 2013 నుంచి 2020 వరకు విజయ యాత్రను కొనసాగించింది. ఐపీఎల్ లో మరే జట్టు కూడా ఇన్ని సంవత్సరాలపాటు కొద్ది తేడాతో ట్రోఫీలను అందుకోలేదు. అందువల్లే ఐపీఎల్లో 2013 నుంచి 2020 వరకు ముంబై నామ సంవత్సరాలు అని అభిమానులు పేర్కొంటుంటారు.. ఐదుసార్లు విజేతగా నిలవడం వల్లే ఐపిఎల్ లో అత్యంత బలమైన జట్టుగా ముంబై నిలిచింది. అత్యంత విలువైన జట్టుగా కూడా ఆ జట్టు ఆవిర్భవించింది. ఎంతోమంది అద్భుతమైన ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. అందులో కొంతమందిని భారత జాతీయ జట్టులోకి పంపించింది. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ముంబై జట్టు నుంచి వచ్చినవారే.
Also Read : మెట్లు ఎక్కేందుకు కూడా ఇబ్బంది.. రోహిత్ శర్మకు ఏమైంది?
డ్రింక్స్ బాయ్ ని చేశారు
లక్నో జట్టుతో శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టు తలపడింది.ఆ పోరులో తుది ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. దీంతో అతడి అభిమానులు ఒకసారి గా ఆందోళన చెందారు. రోహిత్ శర్మను తుది జట్టులో ఎందుకు తీసుకోలేదని హార్దిక్ పాండ్యా ను ప్రశ్నిస్తే.. అతడి మోకాలికి గాయమైందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మైదానంలో పరిశీలిస్తే రోహిత్ కనిపించాడు. అంటే రోహిత్ మోకాలికి గాయం కాలేదని.. ఫామ్ లో లేకపోవడం వల్లే అతడిని తప్పించారని ప్రచారం జరిగింది. మరోవైపు హార్దిక్ అభిమానులు రోహిత్ శర్మ మెట్లు కూడా ఎక్కలేకపోతున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నిజంగానే రోహిత్ శర్మకు మోకాలికి గాయమైందని అందరూ అనుకున్నారు. ఇక స్ట్రాటజిక్ టైం అవుట్.. డ్రింక్స్ బ్రేక్ సమయంలో.. ముంబై జట్టు ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకెళ్తూ రోహిత్ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా రోహిత్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ ని అందించిన రోహిత్ ఇలా డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తడం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒకవేళ మోకాలి నొప్పి గనుక ఉండి ఉంటే రోహిత్ శర్మ డ్రింక్స్ మోసుకెళ్తూ మైదానంలోకి అంత దూరం ఎలా నడిచాడని వారు ప్రశ్నిస్తున్నారు..” రోహిత్ శర్మను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. గత సీజన్లోఅతడిని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ సీజన్లో ఫామ్ లో లేడని మ్యాచ్ నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడేమో డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తించారు. చూడబోతే రోహిత్ శర్మను బలవంతంగా జట్టు నుంచి బయటికి పంపించేలా ఉన్నారు. ఐదుసార్లు ముంబై జట్టును విజేతగా నిలిపిన ఆటగాడికి ఇదా ఇచ్చే గౌరవం అంటూ” రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
Also Read : గాయమా తీసేసారా.. రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ 11 లో ఎందుకు లేడు?