Hardik Pandya
Hardik Pandya : ఐపీఎల్ లో భాగంగా లక్నో లోని వాజ్ పేయి స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై జట్టు టాస్ గెలిచినప్పటికీ.. లక్నో జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు లాస్ అయి లక్నో జట్టు 203 పరుగులు చేసింది. లక్నో జట్టులో మిచెల్ మార్ష్(60) సంచలన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మార్క్రం(53) హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. ఆయుష్ బదోని (30), డేవిడ్ మిల్లర్ (27) చివర్లో దూకుడుగా ఆడారు. ఫలితంగా లక్నో జట్టు భారీష్ స్కోర్ చేసింది. 204 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై జట్టు ముందు ఉంచింది. అయితే ఈ భారీ టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన ముంబై జట్టుకు ఊహించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్ రికెల్టన్ (10) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరో విల్ జాక్స్ (5) ఆకాష్ దీప్ బౌలింగ్లో పెవిలియన్ చేరుకున్నాడు. అయితే ఓపెనర్లు వెంట వెంటనే అవుట్ కావడంతో మైదానంలోకి సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ వచ్చారు.. సూర్య కుమార్ యాదవ్(38*), నమన్ ధీర్(46) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 35 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని దిగ్వేష్ రాటి విడగొట్టాడు. హాఫ్ సెంచరీ వైపు వెళ్తున్న నమన్ ధీర్ ను దిగ్వేష్ రాటి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 86 పరుగుల వద్ద ముంబై జట్టు మూడో వికెట్ కోల్పోయింది.
Also Read : రోహిత్ శర్మ.. తిలక్ వర్మ ఏం చేశారు? హార్దిక్ పాండ్యాకు బుర్ర పని చేస్తోందా?
సరికొత్త రికార్డు సృష్టించాడు
అంతకుముందు లక్నో జట్టు ఇన్నింగ్స్ లో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రెండవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో షేన్ వార్న్ 57 వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. లక్నో జట్టుకు జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో రెండవ స్థానానికి ఎగబాగాడు. అతడు కెప్టెన్ గా ఉంటూ 30 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే 30 వికెట్లు తీసి హార్దిక్ పాండ్యాతో సమానంగా కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 25 వికెట్లతో మూడవ స్థానంలో.. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ 21 వికెట్లతో నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో మార్క్రం, పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆకాష్ దీప్ ను అవుట్ చేశాడు.. కీలక సమయంలో లక్నో జట్టు ప్లేయర్లను అవుట్ చేయడంతో.. మరింత భారీ స్కోర్ చేసే అవకాశం ఆ జట్టుకు లేకుండా పోయింది. ఒకవేళ హార్థిక్ పాండ్యా ఆ వికెట్లు కనుక సాధించకపోయి ఉంటే.. లక్నో జట్టు మరింత భారీ స్కోర్ చేసేది. కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో లక్నో జట్టు ఇబ్బంది పడింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ ఎదురు దాడికి దిగకుండా కట్టడి చేయడంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు విజయవంతమయ్యారు. బౌలర్లతో మార్చి మార్చి బౌలింగ్ వేయించడం ద్వారా హార్దిక్ పాండ్యా కూడా ఫలితాన్ని రాబట్టాడు. అయితే చివర్లో ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడటంతో లక్నో జట్టు స్కోరు 200 పరుగులను దాటింది.
Also Read : విరాట్ కోహ్లీని అధిగమించిన హార్దిక్ పాండ్యా.. వామ్మో ఈ క్రేజ్ ఏందయ్యా బాబూ..