Mohammed Kaif : లక్నో, ఢిల్లీ, తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయి.. హ్యాట్రిక్ ఓటములను సన్ రైజర్స్ హైదరాబాద్ మూట కట్టుకుంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్లాలంటే తదుపరి ఆడే అన్ని మ్యాచ్లను గెలవాల్సి ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తదుపరి ఆడే మ్యాచ్లలో బెంగళూరు, చెన్నై, ముంబై, గుజరాత్ వంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. అయితే ఈ జట్లను ఓడించాలంటే హైదరాబాద్ జట్టు మరింత సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. లేకపోతే ఫలితం తేడాగా వచ్చే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే హైదరాబాద్ జట్టు ఈసారి గ్రూపు దశ నుంచే నిష్క్రమించే అవకాశం ఉంది. అలా జరగకూడదు అంటే హైదరాబాద్ ఆటగాళ్లు మెరుగ్గా రాణించాలి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలి. మరీ ముఖ్యంగా 300 స్కోర్ అని టార్గెట్ పెట్టుకోకుండా.. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడితే పెద్దగా ఇబ్బంది ఉండదు…
Also Read : అది ధోని క్రేజ్ అంటే.. కోహ్లీ, రోహిత్ కూడా సైడ్ అయిపోయారు!
పూర్ కెప్టెన్సీ
హైదరాబాద్ జట్టు గురువారం కోల్ కతా చేతిలో ఓడిపోవడంతో.. మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ నాయకత్వంపై సీనియర్ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఆ జాబితాలో టీమిండియా ఒకప్పటి ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ ఆట తీరుపై.. కెప్టెన్సీ పై మండిపడ్డాడు. ” హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ క్లిక్ కావడం లేదు. బౌలింగ్ దారుణంగా ఉంది.. కెప్టెన్సీ పరమ దరిద్రంగా ఉంది. గురువారం నాటి మ్యాచ్లో స్పిన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసినప్పటికీ.. మళ్లీ వారికి అవకాశం ఇవ్వలేదు. హైదరాబాద్ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒత్తిడి కూడా విపరీతంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆటగాళ్లు కాస్త ఇబ్బంది పడటం సహజమే. కానీ వరుసగా మూడు మ్యాచ్లలో హైదరాబాద్ ఓడిపోయింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.. అభిషేక్ శర్మ, హెడ్ లోపాలను ప్రత్యర్థి బౌలర్లు కనిపెట్టేశారు. దీంతో ఆ దిశగా బంతులు వేయడం.. వారు వికెట్లు పారేసుకోవడం గత మూడు మ్యాచ్లలో జరిగింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు తిరిగి రేజ్ కావడం అంటే చాలా కష్టం. ఇలాంటి స్థితిలో హైదరాబాద్ జట్టు అనేక మార్పులు చేయాలి. ప్రక్షాళన మొదలు పెట్టాలి. జట్టుకు భారంగా ఉన్న ఆటగాళ్లను దూరం పెట్టి.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే హైదరాబాద్ జట్టు విజయాలు సాధించగలుగుతుంది. ఏమైనా చేయగలుగుతుందని” కైఫ్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు కైఫ్ చేసిన వ్యాఖ్యలతో చాలామంది హైదరాబాద్ అభిమానులు ఏకీభవించారు. ” హైదరాబాద్ జట్టులో చాలా లోపల ఉన్నాయి. వాటన్నింటినీ సవరించుకోవాలి. లేకపోతే ఈసారి గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాల్సి ఉంటుంది. మహమ్మద్ కైఫ్ చేసిన సూచనలు విలువైనవి గా ఉన్నాయి. వీటిని హైదరాబాద్ జట్టు అమలు పడితే బాగుంటుందని” సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : RCB పై ఇతడి అభిమానం వేరే లెవెల్..