Homeక్రీడలుక్రికెట్‌Rohith Sharma : రోహిత్ మళ్లీ విఫలం.. ఇలాగైతే కష్టమే..

Rohith Sharma : రోహిత్ మళ్లీ విఫలం.. ఇలాగైతే కష్టమే..

Rohith Sharma :  ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్ ను 234 పరుగుల వద్ద ముగించింది. సోమవారం ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టిన రెండో ఓవర్ లోనే లయన్ (41) వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో లయన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా ఎదుట 340 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేదించడానికి రంగంలోకి దిగిన టీమిండియాకు మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ప్రారంభంలో అత్యంత నిదానంగా ఆడారు. ఆస్ట్రేలియా బోలాండ్, కమిన్స్, స్టార్క్ రూపంలో ఎటాక్ చేయడంతో పరుగులు రావడమే గగనమైంది. జైస్వాల్ పర్వాలేదు అనిపించిన.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం దారుణంగా ఆడాడు. 40 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేసి.. కమిన్స్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు రోహిత్ శర్మ ఒక్కటంటే ఒక్కటి కూడా స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడలేదు.. గత ఐదు ఇన్నింగ్స్ లలో రోహిత్ హైయెస్ట్ స్కోర్ 10 పరుగులు అంటే.. అతని చాటింగ్ ఇంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ పేరుకు బౌలర్ అయినప్పటికీ..మెల్ బోర్న్ మైదానంలో తొలి ఇన్నింగ్స్ లో 49, రెండవ ఇన్నింగ్స్ లో 41 పరుగులు చేశాడు. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ లో 91/6 వద్ద ఉన్నప్పుడు బ్యాటింగ్ కు దిగిన కమిన్స్ లబూషేన్ తో కలిసి ఏడో వికెట్ కు 57 పరుగులు ఓడించాడు. దీంతో అప్పటిదాకా ఆస్ట్రేలియా పై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా బౌలర్ల ఉత్సాహాన్ని కమిన్స్ తగ్గించాడు. దీంతో ఆస్ట్రేలియా నాలుగు రోజు మొత్తం బ్యాటింగ్ చేసింది.

ఇక రిటైర్మెంట్ ప్రకటించు

రోహిత్ దారుణమైన ఫామ్ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆడింది చాలుగాని రిటైర్మెంట్ ప్రకటించు అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..” పెర్త్ లో బుమ్రా సారధ్యంలో టీమిండియా 295 పరుల తేడాతో ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించింది. ఏ ముహూర్తాన మహానుభావుడు రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ అందుకున్నాడో.. టీమ్ ఇండియాకు దరిద్రం అంటుకుంది. న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టులు స్వదేశంలో ఓడిపోయినట్టుగానే.. ఆస్ట్రేలియాపై అడిలైడ్ టెస్టులో భారత్ ఓడిపోయింది. బ్రిస్బేన్ లో వర్షం వల్ల గట్టెక్కింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. వర్షం మనకోసమే కురవడం వల్ల టీమిండియా గౌరవాన్ని కాపాడుకోగలిగింది. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి దక్షిణాఫ్రికా వెళ్ళింది. మనం కూడా ఈసారి వెళ్లాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ అద్భుతంగా ఆడుతున్నాడు. పేరుకు బౌలర్ అయినప్పటికీ వికెట్లు, పరుగులు తీస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మైదానంలో ఉండడానికే ఇబ్బంది పడుతున్నాడు.. ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు.. తనని ఏదో బలవంతంగా ఆడిస్తున్నట్టు ఆడుతున్నాడు. ఇలా ఇబ్బంది పడుతూ ఆడటంకంటే రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమం. ఆల్రెడీ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా ఆలస్యం చేస్తే రోహిత్ ఉన్న పరువు కూడా పోగొట్టుకుంటాడు. టి20 వరల్డ్ కప్ అందించిన ఘనత అతడికి ఉంది. దానిని అలానే కొనసాగించి.. గొప్ప పేరును నిలుపుకోవాలంటే కచ్చితంగా అతడు టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని” అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular