https://oktelugu.com/

Rohit Sharma- Virat Kohli : రిటైర్మెంట్‌ బాటలో రోహిత్, కోహ్లీ.. 2025లో టీమిండియా కొత్త క్రికెట్‌ టీం!

2024 మరో పది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది క్రికెట్‌లో టీమిండియా జయాపజయాలు చవి చూసింది. ఘన విజయాలతోపాటు ఘోర పరాజయాలు కూడా ఎదురయ్యాయి. భారత జట్టులో వెటరన్‌ ఆటగాళ్లు విఫలం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 21, 2024 / 11:16 AM IST

    Rohit Sharma- Virat Kohli

    Follow us on

    Rohit Sharma- Virat Kohli :  భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరే ఇతర క్రీడలకు లేదు. క్రికెట్‌ అంటే పడి చచ్చేంత ఫ్యాన్స్‌ ఉన్నారు. టీమిండియాలోని క్రీడాకారులకు ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే 2024లో క్రికెట్‌ అభిమానుల హార్ట్‌ బ్రేక్‌ అయింది. చాలా మంది స్టార్‌ ప్లేయర్లు వివిధ ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు. తాజాగా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఈ ఏడాది రిటైర్మెంట్‌ తీసుకున్న క్రికెటర్ల జాబితాలో అశ్విన్‌తోపాటు జేమ్స్‌ అండర్సన్, శిఖర్‌ ధావన్, దినేశ్‌ కార్తీక్, టిమ్‌ సౌథీతోపాటు చాలా మంది టాప్‌ ప్లేయర్లు ఉన్నారు. ఇక 2025లో కూడా టీమిండియా నుంచి కీలక ఆటగాళ్లు రిటైర్మెట్‌ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా క్రిక్‌ బజ్‌ ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది. ఇందులో రిటైర్మెంట్‌ ప్రకటించే క్రికెటర్లలో భారత్‌ నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కూడా ఉన్నారు.

    2024లో రిటైర్మెంట్లు ఇలా..
    డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)
    ఈ ఏడాది మొదట రిటైర్మెంట్‌ ప్రకటించిన క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. సిడ్నీలో పాకిస్తాన్‌తో చివరి టెస్టు ఆడిన తర్వాత కెరీర్‌కు ముగింపు పలికాడు. అతడు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు.

    రోహిత్‌ శర్మ (భారత్‌)
    టీమిండియా క్రికెట్‌ జట్టు సారథి రోహిత్‌శర్మ. టెస్టులు, వన్డేల్లో రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ గెలిచాక పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 4,231 పనుగులు చేశాడు.

    విరాట్‌ కోహ్లీ
    2024లో రిటైర్మెంట్‌ ప్రకటించిన మరో భారత క్రికెటర్‌ కింగ్‌ కోహ్లీ. 2024లో టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. టెస్టు, వన్డేల్లో కొనసాగుతున్నాడు. ులు చేశాడు.

    దినేశ్‌ కార్తీక్‌
    ఈ ఏడాది వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా రిటైర్మెంట్‌ ప్రకటించారు. అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. ఆర్తీక్‌ దాదాపు రెండు దశాబ్దాలు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

    అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లు.. వివిధ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. కొందరు పూర్తిగా క్రికెట్‌ నుంచి వైదొలికి అభిమానుల హాట్‌ బ్రేక్‌ చేశారు. 2024లో డేవిడ్‌ వార్నర్‌తో మొదలైన రిటైర్మెంట్ల పరంపర.. భారత ఆఫ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వరకు కొనసాగింది. రిటైర్మెంట్‌ జాబితాలో జేమ్స్‌ అండర్సన్, శిఖర్‌ ధావన్, దినేశ్‌ కార్తీక్, టిమ్‌ సౌథీ సహా చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఏడాది రిటైర్మెంట్‌ తీసుకున్న కొంతమంది ఆటగాళ్లు వీరు.

    డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)
    ఈ ఏడాది మొదటి రిటైర్మెంట్‌ ప్రకటించిన మొదటి క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. స్వదేశంలోని సిడ్నీలో పాకిస్తాన్‌తో చివరి టెస్టు ఆడిన వార్నర్‌ తర్వాత అన్ని ఫర్మాట్‌లకు రిటైర్మెంట్‌ పలికాడు. అన్ని ఫార్మాట్‌లలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు వార్నర్‌.

    రోహిత్‌ శర్మ (భారత్‌)
    టీమ్‌ఇండియాకి టెస్టులు, వన్డేల్లో రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌ గెలిచాక, పొట్టి ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. అతడు 159 అంతర్జాతీయ టీ20ల్లో 4,231 పరుగులు చేశాడు. వచ్చే ఏడాది వన్డేలు, టెస్టులకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని క్రిక్‌బస్‌ తన కథనంలో పేర్కొంది.

    విరాట్‌ కోహ్లీ..
    2024 టీ20 ప్రపంచ కప్‌ విజయం తర్వాత విరాట్‌ కోహ్లి కూడా రిటైర్‌మెంట్‌ ఇచ్చేశాడు. టెస్టు, వన్డేల్లో కొనసాగుతున్నాడు. కోహ్లీ టీ20ల్లో 125 మ్యాచుల్లో 4,188 పరుగులు చేశాడు.

    దినేశ్‌ కార్తీక్‌..
    భారత్‌కు చెందిన మరో వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా ఈ ఏడాది రిటైర్మెంట్‌ ప్రకటింఆరు. 2024, జూన్‌ 1న తాను అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు టీమిండియా తరఫున ఆడిన కార్తీక్‌ 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్‌లు 26 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

    హెన్రిచ్‌ క్లాసెన్‌
    దక్షిణాప్రికాకు చెందిన హెన్రిచ్‌ క్లాసెన్‌ 2024, జనవరిలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మెన్‌ అయిన హెన్రిచ్‌ కేవలం నాలుగు టెస్టులు ఆడాడు. వన్డేలు, టీ20ల్లో కొనసాగనున్నారు.

    షకీబ్‌ అల్‌ హసన్‌
    బంగ్లాదేశ్‌కు చెందిన ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 2024లో టీ20 నుంచి రిటైర్మెంట్‌ ప్రటించారు. 129 టీ20 మ్యాచ్‌లు ఆడిన షకీబ్‌ 2,551 పరుగులు చేశాడు. 149 వికెట్ల పడగొట్టాడు.

    రవీంద్ర జడేజా..
    టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌ ప్రకటించారు. టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 54 వికెట్లు తీశాడు. 515 పరుగులు చేశాడు.

    రవిచంద్రన్‌ అశ్విన్‌..
    తాజాగా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అన్నిఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు. అశ్విన్‌ 106 టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20 మ్యాచ్‌లలో 72 వికెట్లు పడగొట్టాడు.

    వచ్చే ఏడాది రోహిత్, కోహ్లీ..
    ఈ ఏడాది నలుగురు టీమిండియా క్రికెటర్లు వివిధ ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. 2025లో టీమిండియాకు చెందిన వెటరన్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కూడా రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉంది. అందుకే కోహ్లీ తన మకాం లండన్‌కు మారుస్తున్నారని తెలుస్తోంది. ఇక రోహిత్‌ శర్మ కూడా వరుసగా విఫలం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో సడెన్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.