Tollywood Industry : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వాళ్ళను వాళ్లు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చాలామంది ఇండస్ట్రీకి వచ్చి చాలా రకాల కష్టాలను అనుభవించి చివరికి వాళ్లు సంపాదించిందంతా పోగొట్టుకొని ఇంటికి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటే ఆ అషామాషి వ్యవహారం కాదు…సినిమా ఇండస్ట్రీ గురించి తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి సినిమాలను చేయాలనే ఒక ఇంట్రెస్ట్ తో సినిమా చేసి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ఒక రైతు జంట 9 సంవత్సరాల క్రితం స్పిరిట్ అనే సినిమాని స్టార్ట్ చేసి వాళ్ళకి ఉన్న 30 ఎకరాల భూమిని, డెబ్బై మేకలను, 30 గేదెలను అమ్ముకొని కోటి రూపాయలు పెట్టి మరి సినిమాను తీశారు. ఇక మొత్తానికైతే ఆ సినిమాని అప్పటినుంచి ఇప్పటివరకు రిలీజ్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్స్ గానీ, ఏ డిస్ట్రిబ్యూటర్స్ గానీ వాళ్ళకు దొరక్కపోవడంతో తీసిన సినిమా అలానే ఉంది వాళ్ళు రోడ్డు మీద పడ్డారు.
ఇప్పటికైనా వాళ్ళ కి అండగా సినిమా ఇండస్ట్రీ నిలబడితే బావుంటుంది అంటూ చాలామంది ప్రేక్షకులు వాళ్ల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా సినిమా బిజినెస్ అనేది అంత ఆషామాషీగా జరగదు. అందువల్ల ఒక సినిమాని తీసేటప్పుడు దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను తెలుసుకొని దాని మీద ఎంత పెట్టాలి.
దానిమీద ఎంత రాబడి వస్తుందనేది క్లియర్ కట్ గా తెలుసుకున్న తర్వాతే సినిమా చేయాలి. కానీ ఇలా సినిమా మీద పిచ్చితో ఇలాంటివి చేస్తే ఇబ్బంది పడక తప్పదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు దయ తలచి వాళ్లకు సంబంధించిన సినిమాలు కొన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే వాళ్లు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో దగ్గరికి వెళ్లి అతని చేత ట్రైలర్ రిలీజ్ చేయిద్దామని అనుకున్నప్పటికి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వాళ్ళను తీసుకుపోవట్లేదంటూ వాళ్ల ఏడుస్తూ చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మరి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించేది ఎవరు? సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అంతా ఒకటై పోరాటం చేస్తాం అంటారు. మరి ఇలాంటి రైతు కుటుంబం ఉన్నదంతా అమ్మి రోడ్డు మీదకు వచ్చి ఒక సినిమాను తీసి రిలీజ్ చేసుకునే అవకాశం కూడా లేదా? వాళ్లకి ప్రతి ఒక్క సినిమా హీరో అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఉంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…