Rohit Sharma: టీమిండియాకు టి20 వరల్డ్ కప్ అందించడం.. ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేయడం.. ఆసియా కప్ లు దక్కించడం.. ఇలాంటి చాలా ఘనతలే టీమిండియాకు అందించాడు రోహిత్ శర్మ. అతడి నాయకత్వంలో టీమిండియా రాకెట్ లాగా దూసుకుపోయింది. విరాట్ కోహ్లీ.. అగ్రెసివ్ ఆట తీరు టీమిండియా కు పరిచయం చేస్తే.. తన నాయకత్వంలో అగ్రెసివ్ తో పాటు.. ఆలోచనాత్మకమైన ఆట తీరును పరిచయం చేశాడు రోహిత్ శర్మ.
రోహిత్ శర్మ ప్రస్తుతం ఒక ఆటగాడి గానే జట్టులో ఉన్నాడు. మేనేజ్మెంట్ సూచనల మేరకు అతడు టెస్ట్, వన్డే నుంచి తప్పుకున్నాడు. ఆటగాడి గానే కొనసాగుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి అతడు తప్పుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు t20 నుంచి కూడా దూరం జరిగాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే రోహిత్ కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో అతడు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వాస్తవానికి తన శైలిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఇది రోహిత్ శర్మ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే అతని ఆట తీరును మేనేజ్మెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే అతనికి షాక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
2027లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. దీనికి సంబంధించి మేనేజ్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది. టీం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మకు సంబంధించిన విషయంలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. వచ్చే వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మను పక్కన పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా మొత్తం రోహిత్ శర్మ విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా అరుతున్న సమాచారం ప్రకారం జట్టు ప్రణాళికలలో భాగంగా రోహిత్ శర్మకు అవకాశం దక్కకపోవచ్చని.. అతడు త్వరలోనే జట్టును వీడి వెళ్లిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని యాజమాన్యం అతనికి చెప్పిందని సమాచారం.
రోహిత్ స్థానంలో జైస్వాల్ లేదా ఇతర యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇస్తారని సమాచారం ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మ తన చివరి వన్డే ఆడతాడని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 2027 ప్రపంచ కప్ జట్టులో అతడు భాగం కాకపోతే అతడు వన్డే క్రికెట్ ను కొనసాగించడంలో అర్థం లేదు. అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. మరి దీనిపై రోహిత్ శర్మ.. మేనేజ్మెంట్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. కాగా, రోహిత్ శర్మ మీద పగ పట్టారా.. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఎందుకీ అన్యాయం అంటూ అతడి అభిమానులు పేర్కొంటున్నారు.
