Hardik Pandya: ఇక వన్డే వరల్డ్ కప్ ముగిసింది వెంటనే అందరు ఐపీఎల్ కోసం సిద్దం అవుతున్నారు.ఇక అందులో భాగంగానే ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్లు కూడా సిద్దం అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఐపీఎల్ లో ఏ టీమ్ ఏ ప్లేయర్ ని ఉంచుకోవాలి ఏ ప్లేయర్ ని రిలీజ్ చేయాలి అనే దాని పైననే ప్రస్తుతం విపరీతమైన చర్చ నడుస్తుంది.ఇక డిసెంబర్ 19 న మినీ యాక్షన్ ఉండటం తో ప్రతి టీమ్ కూడా వాళ్ల టీమ్ నుంచి రిలీజ్ చేసే ప్లేయర్ల పేర్ల ని ఈనెల 26 లోగా ఫైనల్ చేసి ఐపీఎల్ పాలక మండలికి అందజేయాల్సి ఉంటుంది…
ఇక గత ఐపిఎల్ లో చాలా డబ్బులు పెట్టీ కొన్న ఏ ప్లేయర్ కూడా వాళ్ల సామర్థ్యం మేరకు రానించలేకపోయారు. ఇక దాంతో ఇప్పుడు ఆ ప్లేయర్లందరిని వదిలేసి వేరే ప్లేయర్ల ను తీసుకోవాలని ఆ టీమ్ ప్రాంచైజర్లు చూస్తున్నారు…గత ఏడాది అత్యధిక ధర పలికిన సామ్ కరణ్ (18.50 కోట్లు) ను పంజాబ్ జట్టు వదిలించుకోవాలని చూస్తుంది.అలాగే మరో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్(16.25 కోట్లు) ని పెట్టీ కొనుకున్న చెన్నై టీమ్ కూడా అతన్ని వదిలేయాలని చూస్తుంది…
ఇక ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ప్లేస్ లో ముంబై టీమ్ లోకి హార్దిక్ పాండ్య వస్తున్నాడు అంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే ముంబై టీమ్ లో ఉన్న రోహిత్ మాత్రం గుజరాత్ టీమ్ లోకి వెళ్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.కానీ రోహిత్ ని ముంబై వదులుకునే ప్రసక్తి లేదు అంటూ మరి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి…ఇక హైద్రాబాద్ టీమ్ హరీ బ్రూక్స్ ని వదిలేసి వేరే ప్లేయర్లను తీసుకోవాలని చూస్తున్నారు…ఇక కలకత్తా అయితే రసెల్, సునీల్ నరైన్ లను తీసివేసి ముందుకు వెళ్ళాలని చూస్తుంది…ఇక ఆ టీమ్ లో ఉన్న పేసర్స్ అయిన శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఫెర్గూసన్, సౌథీ, షకీబ్, లిట్టన్ దాస్, డేవిడ్ వీస్ లాంటి వాళ్ళని వదిలేయాలని చూస్తుంది….ఇక మొన్న వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీమ్ తరుపున సత్తా చాటిన ట్రావిస్ హెడ్ ని కానీ లేదా ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీమ్ నుంచి ఆల్ రౌండర్ షో కనబరిచిన రచిన్ రవీంద్ర ని కానీ టీమ్ లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
అయితే ఈసారి వేలం లోకి చాలా మంది యంగ్ ప్లేయర్స్ రానున్నట్టు గా తెలుస్తుంది ముఖ్యంగా మొన్న వరల్డ్ కప్ లో సత్తా చాటిన అఫ్గాన్ ప్లేయర్ల కోసం కూడా పోటీ నడిచే అవకాశం ఉంది.ఎందుకంటే వాళ్ళు అయితే తక్కువ లో వస్తారు మళ్ళీ మంచి ప్రతిభ కనబరుస్తారు కాబట్టి వాళ్ల మీద కూడా పోటీ భారీ గానే ఉండేలా కనిపిస్తుంది…