Rohit Sharma : నాయకుడంటే నడిపించాలి.. తన సైన్యం కష్టాల్లో ఉంటే ముందుండి పోరాడాలి.. పోరాట పఠిమను చూపించాలి. ఎంత పెద్ద ప్రత్యర్థి ఉన్న వారిని తుత్తునియలు చేయాలి.. ‘కాలకేయులు ఎగబడినప్పుడు మన బాహుబలి అదే చేశాడు. ఇప్పుడు టీమిండియా తరుఫున మన కెప్టెన్ రోహిత్ శర్మ అదే పనిచేస్తున్నాడు. సెంచరీల కోసం చూడకుండా ప్రత్యర్థి బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ భారీ స్కోరు కోసం ధాటిగా ఆడి ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేస్తున్నాడు. తన తర్వాత వచ్చే వారిపై ఒత్తిడి తగ్గిస్తున్నాడు. వారు కుదురుగా ఆడి టీంను విజయతీరాలకు చేర్చేలా పక్క ప్రణాళికతో స్ట్రోక్ మేకింగ్ చేస్తున్నాడు. టీమిండియా వరుస విజయాలకు రోహిత్ చేస్తున్న ఈ సాహస బ్యాటింగ్ నే కారణం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. తన సహజ శైలి ఆట నుంచి బయటకొచ్చి మరీ ఇలా ధాటిగా ఆడుతున్న రోహిత్ ను మెచ్చుకోవాల్సిందే.. రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం హైరిస్క్ గేమ్ ఆడుతున్న రోహిత్ ను ఎవ్వరు అభినందించినా అభినందించకున్నా అందరూ కీర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్‌లో అందరికంటే ఎక్కువ ఫోర్లు.. ఎక్కువ సిక్సర్లు కొట్టిన క్రికెటర్ గా నిలిచాడు. ఎక్కువ సగటుతో పవర్‌ప్లేలో వేగంగా ఎక్కువ పరుగులను సాధించగలుగుతున్నాడు. అతడి గణాంకాలు చూస్తే ప్రత్యర్థులు అందనంత ఎత్తులో ఉన్నారు. ఓపెనింగ్ లో దుమ్ము దులుపుతున్నాడు. తన దూకుడైన ఆటతో బీభత్సం సృష్టిస్తున్నాడు. సాంప్రదాయిక ఆరంభాలు కాకుండా అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఇది హైరిస్క్ అయినా.. తాను ఔట్ అవుతానని తెలిసినా కూడా తన ఆటతీరు ను మార్చుకోవడం లేదు. జట్టు కోసం తనను తాను బలితీసుకుంటున్నాడు. రికార్డుల వేట పోకుండా భారత్ కు భారీ ఆరంభం ఇస్తున్నాడు. భారీ పరుగులతో జట్టు కోసం ఒక బాట పరుస్తున్నాడు.. ఒక కెప్టెన్ గా దీన్ని అత్యధిక రిస్క్ తో కూడుకున్న ఈ పాత్రను స్వీకరించడాడు. తర్వాత వచ్చే బ్యాటర్ లకు పనిని సులువు చేస్తున్నాడు.
గత పదేళ్లుగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ రెండు లేదా మూడు జట్లలో భారత్ నిలకడగా ఉంది. రోహిత్ పగ్గాలు చేపట్టినప్పటి నుండి టీమిండియా ఆటతీరు మారిపోయింది. ఆటగాళ్లపై నమ్మకం.. దూకుడు తత్వం పెరిగిపోయింది. రోహిత్- కోచ్ రాహుల్ ద్రవిడ్ లు ఆటగాళ్లను తమ కంఫర్ట్ జోన్ల నుండి తమను తాము బయటకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రారంభ -మధ్య ఓవర్లలో వారి వికెట్లను కోల్పోకుండా జాగ్రత్తగా ఆడేలా ప్లాన్ చేశారు. ఇతర బ్యాటర్లు కూడా దీనిని అనుసరించాలని రోహిత్ ధాటిగా ఆడి భారీ స్కోరు పెట్టి తన వికెట్ ను త్యాగం చేస్తున్నారు.
పవర్‌ప్లేలో రోహిత్ 30% బంతుల్లో బౌండరీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ మాత్రమే రోహిత్ లాగా అటాకింగ్ ఆడుతున్న బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. కానీ అతడు ఎక్కువగా విజయం సాధించలేదు. ఆ బౌండరీ ప్రయత్నాల్లో రోహిత్ 77% నియంత్రణలో ఉన్నాడు. ఇది అద్భుతమైన సామర్థ్యంగా చెప్పొచ్చు. ఫలితంగా పవర్‌ప్లేలో వేగంగా స్కోర్ చేయడంలో ఆస్ట్రేలియా కంటే భారత్ ముందంజలో ఉంది.
భారత్ సాధారణంగా పవర్‌ప్లేలో దంచికొడుతోంది. రోహిత్ దానిని ముందుండి నడిపిస్తున్నాడు. ఇదే మేనేజ్‌మెంట్‌ను కూడా ఆశ్చర్యపరిచింది. “ఇది రోహిత్ ఆలోచననే, అతడే చొరవ తీసుకుంటున్నాడు” అని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అన్నారు. “ప్రపంచ కప్‌లో ఎటువంటి వ్యూహాలు లేవు. మేము టాప్ నాక్ ఆడి ఫైనల్ చేరుకోవాలని చూస్తున్నాము, వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చూస్తున్నాము. ఉపరితలం బాగుంటే రోహిత్ భారీ పరుగులు చేస్తున్నాడు.”
టీమిండియా బ్యాటింగ్ చేసినప్పుడు బంతి ఎక్కువగా స్వింగ్ కాకపోవడంతో రోహిత్ కు కలిసి వచ్చింది. ప్రతి బాల్‌తో రెండు ఓవర్లు చూసిన తర్వాతనే రోహిత్ అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. పవర్‌ప్లే యొక్క సెకండాఫ్ ను క్యాష్ చేయడం టీమిండియా ప్రణాళిక. రోహిత్ స్వింగ్ లేకపోవడం చూసి చాలా ముందుగానే అటాకింగ్ కు వెళుతూ భారీ స్కోరుకు బాటలు వేస్తున్నాడు.
ఫైనల్‌కు ముందు ఫైనల్‌గా భావించిన దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోనూ రోహిత్ ఇదే చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురి చేశాడు. కోల్ కతా స్లోగా ఉండి క్లిష్టమైన పిచ్ గా మారింది. ఇక్కడ స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత సులువు కాదు. రోహిత్ భారత్‌కు అందించిన భారీ ఆరంభంతో తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ -శ్రేయాస్ అయ్యర్‌లు తమ సమయాన్ని వెచ్చించడానికి.. ప్రమాదకరమైన కేశవ్ మహారాజ్‌కు వ్యతిరేకంగా ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వ్యవహరించడానికి సమయం చిక్కింది. స్లోగా ఆడి భారత్ భారీ స్కోరుకు వీరిద్దరూ బాటలు వేశారు. రోహిత్ మెరుపులు.. కోహ్లీ స్లోగా ఆడడం వల్లే ఇది సాధ్యమైంది. తర్వాత వచ్చే బ్యాటర్లందరికీ రోహిత్ మెరుపు ఆరంభంతో రిలాక్స్ గా ఆడడానికి వీలు కల్పించింది.
కోహ్లి తన సహచరుల కంటే వేగంగా స్కోర్ చేయలేడని కాదు.. కానీ రోహిత్ నుండి అటాకింగ్ గా ఆడి పరుగులు చేస్తే వచ్చేవారికి స్కోరింగ్ పై ఒత్తిడిని దూరం చేస్తాయి. కోహ్లి ఓవర్‌కి ఐదు మాత్రమే స్కోర్ చేయవలసి వచ్చినప్పుడు చాలా వరకు ఈజీగా పూర్తి చేయగలడు. ఇన్నింగ్స్ ను ఎక్కువ సేపు ఉంటూ బ్యాటింగ్ సాగించగలడు. తద్వారా టీమిండియా బ్యాటింగ్ లోతును కోల్పోకుండా ఉంటుంది. విజయం దిశగా సాగుతుంది.
ఛేజింగ్ అంత సులభం కాని టోర్నమెంట్‌లో రోహిత్ ఆరంభాలు మిడిల్ ఓవర్లలో ఛేజింగ్‌లోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ప్రమాదం లేకుండా చేస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కనిపించిన విధంగా హై-రిస్క్ గేమ్ ఆడగలననే విశ్వాసాన్ని కోహ్లీ కల్పించాడు.
కోచ్‌లు రోహిత్‌ను అలా బ్యాటింగ్ చేయమని కోరారా అని మన బ్యాటింగ్ కోచ్ రాథోర్‌ను విలేకరులు అడగ్గా.. ‘జట్టు కోసమే అతడు ఫాస్ట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను వికెట్ బాగుందని భావిస్తే తన షాట్లకు వెళ్లగలుగుతున్నాడు.. మిడిల్ ఓవర్ల ఒత్తిడిని కాకుండానే రోహిత్ ఇలా సొంతంగానే నిర్ణయం తీసుకొని ఆడుతున్నాడు. ఇది జట్టుకు బాగా పని చేస్తోంది.” అని తెలిపాడు. “దీనికి చాలా నమ్మకం అవసరం. అందుకే రోహిత్ గొప్ప బ్యాట్స్‌మెన్. అతనికి ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. అతను తన చర్యలతో ముందుండే ఒక వ్యక్తి. అతను జట్టు ఆడాలని కోరుకునే విధంగా తనను తాను ఆడుతున్నాడు.” అని పొగడ్తల వర్షం కురిపించాడు రాథోర్.
ఇదే ఫార్ములాతో లీగ్ దశలో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా ఆ చివరి రెండు మ్యాచ్ లలోనూ ఇలానే ఆడుతుందన్న గ్యారెంటీ లేదు, కానీ రోహిత్ నుండి ఇలాంటి ఆట వస్తే మాత్రం టీమిండియాకు తిరుగుండదు.. భారత్ కప్ కొట్టడాన్ని ఎవరూ ఆపలేరు.