గత టెస్టుల్లో టీమిండియాను ఓపెనింగ్ సమస్య వెంటాడింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది టీమిండియా సెలక్షన్ కమిటీ. మొదటి టెస్టులో ఓపెనర్‌గా దిగిన పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతనిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా నిరాశపరిచాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల్లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేదు.
Also Read: టీమిండియాలోకి రోహిత్.. ఎవరికి చెక్?
ఇక మూడో టెస్టులో ఎవరిని ఓపెనర్‌గా దింపాలనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. సీనియర్ మాజీ క్రికెటర్ సునిల్ గవస్కర్ మాత్రం మూడో టెస్టులో రోహిత్‌కు జోడీగా మయాంక్ బరిలోకి దిగాలన్నాడు. అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలని సూచించారు. ఒకవేళ మయాంక్‌కు మరో అవకాశం వస్తే రోహిత్‌ను ఎవరి స్తానంలో జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మయాంక్ జట్టులోనే కొనసాగితే వీహారిపై వేటు పడే అవకాశం ఉంది.
Also Read: సన్‌రైజర్స్ ఆశలపై నీళ్లు : నటరాజన్‌కు నో ఛాన్స్
శుభమన్ గిల్‌ను మిడిల్ ఆర్డర్‌కు పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు టీమిండియాకు ఓపెనర్లుగా బరిలోకి దిగేందుకు శుభ్‌మన్‌గిల్, కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు రెండు టెస్టుల్లోనూ అవకాశం రాలేదు. ఇక ఎట్టకేలకు రోహిత్ క్వారంటైన్ ముగియడంతో గురువారం జట్టులో చేరాడు. రోహిత్ రాకతో ఎవరిపై వేటు పడుతుందోనని ఆసక్తికరంగా మారింది.