షాకింగ్: దేశ ప్రధానిపై బాంబు దాడి.. 26మంది మృతి

ఎంతో హై సెక్యూరిటీ ఉండే దేశ ప్రధానిపై ఏకంగా అత్యంత భద్రత గలిగిన విమానాశ్రయంలో బాంబు దాడి చేశారు. ఈ ఉదంతంలో 26మంది మరణించిన దారుణం చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమైంది. Also Read: ఎల్‌ఆర్‌‌ఎస్‌ లేకున్నా బిల్డింగ్‌ కట్టుకోవచ్చు.. అదెలా అంటే..? గల్ఫ్ దేశమైన యెమెన్ లోని అదెవ్ ఎయిర్ పోర్టులో తాజాగా ఆ దేశ ప్రధానితోపాటు కొత్త మంత్రివర్గాన్ని టార్గెట్ చేసి బాంబు దాడికి పాల్పడ్డారు. రన్ వే […]

Written By: NARESH, Updated On : December 31, 2020 4:41 pm
Follow us on

ఎంతో హై సెక్యూరిటీ ఉండే దేశ ప్రధానిపై ఏకంగా అత్యంత భద్రత గలిగిన విమానాశ్రయంలో బాంబు దాడి చేశారు. ఈ ఉదంతంలో 26మంది మరణించిన దారుణం చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమైంది.

Also Read: ఎల్‌ఆర్‌‌ఎస్‌ లేకున్నా బిల్డింగ్‌ కట్టుకోవచ్చు.. అదెలా అంటే..?

గల్ఫ్ దేశమైన యెమెన్ లోని అదెవ్ ఎయిర్ పోర్టులో తాజాగా ఆ దేశ ప్రధానితోపాటు కొత్త మంత్రివర్గాన్ని టార్గెట్ చేసి బాంబు దాడికి పాల్పడ్డారు. రన్ వే మీద ఉంచిన వాహనంలో బాంబు పేల్చి పేల్చేశారు. వరుస పేలుళ్లతో 26మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 50మందికి పైగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఈ భారీ బాంబ్ బ్లాస్ట్ నుంచి యెమెన్ దేశ ప్రధాని, మంత్రులు క్షేమంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున రాగా.. ప్రధాని, మంత్రులు వస్తున్న ప్రత్యేక విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. వారంతా బయటకు వస్తున్న వేళ రన్ వే మీద నిలిపి ఉంచిన వాహనం భారీ శబ్ధంతో పేలిపోయింది.

Also Read: నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

శక్తివంతమైన బాంబు దాడిలో కొందరి శరీరభాగాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొద్దిరోజులుగా యెమెన్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. వేర్పాటువాదులకు.. ప్రభుత్వం, తీవ్రవాదులకు పోరు నడుస్తోంది. ఇరాన్ అనుకూల హుతి తీవ్రవాదులే ఈ దాడి చేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు