నేటితో ఈయూకు గుడ్ బై చెప్పబోతున్న బ్రిటన్..!

ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో యూరోపియన్ యూనియన్(ఈయూ) కూటమి ఒకటిగా ఉంది. కొన్నేళ్లుగా ఈ కూటమిలో కొన్ని దేశాలు చేరుతుండగా మరికొన్ని దేశాలు తప్పుకుంటున్నాయి. అయితే నేటి అర్ధరాత్రి నుంచి ఈయూ కూటమికి బ్రిటన్ అధికారికంగా గుడ్ బై చెప్పబోతుంది. Also Read: షాకింగ్: దేశ ప్రధానిపై బాంబు దాడి.. 26మంది మృతి ఈయూ కూటమిలో బ్రిటన్ కొనసాగాలా? లేదా అనేది గత కొన్నేళ్లుగా ఆదేశంలో చర్చ జరుగుతోంది. దీనిపై 2016లోనే నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ రెఫరెండం […]

Written By: Neelambaram, Updated On : December 31, 2020 4:01 pm
Follow us on

ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో యూరోపియన్ యూనియన్(ఈయూ) కూటమి ఒకటిగా ఉంది. కొన్నేళ్లుగా ఈ కూటమిలో కొన్ని దేశాలు చేరుతుండగా మరికొన్ని దేశాలు తప్పుకుంటున్నాయి. అయితే నేటి అర్ధరాత్రి నుంచి ఈయూ కూటమికి బ్రిటన్ అధికారికంగా గుడ్ బై చెప్పబోతుంది.

Also Read: షాకింగ్: దేశ ప్రధానిపై బాంబు దాడి.. 26మంది మృతి

ఈయూ కూటమిలో బ్రిటన్ కొనసాగాలా? లేదా అనేది గత కొన్నేళ్లుగా ఆదేశంలో చర్చ జరుగుతోంది. దీనిపై 2016లోనే నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ రెఫరెండం నిర్వహించారు. ఇందులో 52శాతం బ్రిగ్జిట్ కు ఓటేశారు. ప్రజాతీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడంతో కామెరూన్ తన పదవీకి రాజీనామా చేశాడు.

ఆ తర్వాత థెరిసా మే బ్రిటన్ పదవీ చేపట్టారు. 2019 మార్చి 29 నాటికే బ్రెగ్జిట్ ఒప్పందం పూర్తి కావాల్సి ఉంది. అయితే థెరిసా మే కూడా రాజీనామా చేయడం ఈ ఒప్పందం ఆలస్యమైంది. ఆ తర్వాత బోరిస్ జాన్సస్ బ్రిటన్ ప్రధాని అయ్యాక బ్రిగ్జిట్ పై మళ్లీ కదలిక మొదలైంది.

Also Read: ఎల్‌ఆర్‌‌ఎస్‌ లేకున్నా బిల్డింగ్‌ కట్టుకోవచ్చు.. అదెలా అంటే..?

బ్రిటన్ పార్లమెంట్ బ్రిగ్జిట్ కు ఆమోదం తెలుపడంతో ఈయూ నుంచి అధికారికంగా బ్రిటన్ తప్పుకోవడానికి మార్గం సులభమైంది. నేటి రాత్రి 11గంటల తర్వాతి నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి రానుంది. ఈయూ నుంచి బ్రిటన్ శాశ్వతంగా తప్పుకోనుండటంతో ఇకపై ఇతర దేశాల్లా బ్రిటన్‌కు ఇకపై ఎటువంటి వెసులుబాట్లు ఉండవు.

ఈయూ వల్ల బ్రిటన్ కు లాభం చేకూరకపోగా మరింత ఆర్థిక భారం పడుతుండటంతోనే బ్రిటన్ ఈయూ కూటమి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే బ్రిటన్ నుంచి జరిగే వాణిజ్యానికి టారీఫ్‌లు విధించవద్దని ఈయూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్