Rohit Sharma: ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ టీం తన ఒక్క ఫ్యూచర్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యని నియమించింది. ఇక అందులో భాగంగానే ఇంతకుముందు ఉన్న మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ని కెప్టెన్సీ నుంచి తీసేసి ఆ భాద్యతలను పాండ్యకి అప్పగించింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ముంబై ఇండియన్స్ పైన విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి.
ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్ ని టీమ్ నుంచి తప్పించడం అనేది సరైన విషయం కాదు అంటూ కొంతమంది ముంబై ఇండియన్స్ టీమ్ పైన ట్రైల్స్ చేస్తున్నారు. ఇక ఈ సమయంలో మరికొంతమంది మాత్రం ముంబై ఇండియన్స్ కి సపోర్టుగా మాట్లాడుతున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్య నియమించబడ్డాడు కాబట్టి రోహిత్ శర్మ ఓన్లీ ప్లేయర్ గా మాత్రమే ఐపీఎల్ లో ఆడడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో రోహిత్ శర్మని ట్రేడింగ్ విధానం ద్వారా తీసుకోవడానికి పలు రకాల ప్రాంచైజీ లు అయితే తీవ్రమైన కృషిని చేస్తున్నాయి.ఇక ఇప్పటికే ఢిల్లీ యాజమాన్యం వాళ్ల కెప్టెన్ అయిన రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో రోహిత్ శర్మనికి తీసుకొని ఆయన సారథ్యంలో ఢిల్లీ టీం ని ముందుకు నడిపించాలని చూస్తున్నారు. ఇక ఇదే క్రమంలో రోహిత్ శర్మ ఢిల్లీ టీమ్ వైపు వెళ్తాడా లేదా ముంబై ఇండియన్స్ టీమ్ లోనే ప్లేయర్ గా కంటిన్యూ అవుతాడా అనే విషయం పైన పలు రకాల ఆసక్తికరమైన చర్చలు అయితే జరుగుతున్నాయి.
ఇక ముంబై టీం లో రోహిత్ ఉండడం పట్ల తన అభిమానులు తీవ్రమైన విమర్శలని చేస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్ గా తన అవసరం లేదు అని రోహిత్ ని తీసేసిన తర్వాత ఆ టీంలో ఉండాల్సిన అవసరం కూడా రోహిత్ కి లేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ మంచి కెప్టెన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ అవసరం లేనప్పుడు రోహిత్ శర్మ కి ముంబై ఇండియన్స్ టీం కూడా అవసరం లేదు అనే విధంగా అభిమానులు మాట్లాడుతూ రోహిత్ శర్మ ను వెంటనే ట్రేడింగ్ విధానం ద్వారా వేరే ఏదైనా టీంలోకి వెళ్లాలని సూచిస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముంబై ఇండియన్స్ తో రోహిత్ శర్మ ట్రేడింగ్ పట్ల కొన్ని ఆసక్తికరమైన విషయాల మీద మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే నిజమైతే రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడుతాడు…