Mr Bachchan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఏపీ ఎలక్షన్స్ కారణంగా ఒక నాలుగు నెలల వరకు పోస్ట్ పోన్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న హరీష్ శంకర్ ఈ గ్యాప్ ని చాలా చక్కగా వాడుకోవాలని నిర్ణయించుకొని ఈ గ్యాప్ లో ఒక సినిమా చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు ఇక తను అనుకున్నట్టుగానే రవితేజ లాంటి ఒక మాస్ మహారాజా దొరకడం ఆయనకి చాలా వరకు ప్లస్ అయింది.
ఇక వీళ్లు చేసే సినిమాకి పీపుల్స్ మీడియా వాళ్ళు ప్రొడ్యూసర్లుగా మారడం చాలా వెంట వెంటనే జరిగిపోయింది. ఇక దాంతో ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ని పెట్టి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈయన డ్యూయల్ రోల్ లో నటించిన విక్రమార్కుడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా విక్రమార్కుడు రేంజ్ లో సక్సెస్ అవ్వాలని టీం మొత్తం మంచి ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రవితేజ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది.ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ లో చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఇంత దూరం ట్రావెల్ చేశాడు అంటే ఆయన కష్టం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎప్పుడు కూడా ఒక స్టార్ హీరో రేంజ్ లో ఆయన సినిమాలు చేయలేదు. తనకి నచ్చిన ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలను చేయడానికి తను ఎప్పుడు ముందుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పును పొందుతుంది అని అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
ఇక ఇప్పటికే ఆయన ఈ దసరాకి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో వచ్చి ఒక ప్లాప్ ని మూటగట్టుకున్నాడు అయినప్పటికీ తను ఎక్కడ కూడా తగ్గకుండా మళ్లీ మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అటు హరీష్ శంకర్ కి ఇటు రవితేజ కి మంచి విజయం దక్కుతుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…