IND vs BAN : టీమిండియా ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇటీవల కాలంలో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ.. దుబాయ్ లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే స్వల్పంగానే చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అక్కడి వాతావరణం పొడిగా కనిపిస్తోంది. దీంతో మైదానంపై తేమ ఉంటుందని.. ఆది పేస్ బౌలర్ల కంటే స్పిన్నర్ల కే అనుకూలిస్తుందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గురు స్పిన్నర్లను తీసుకున్నాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ కు కూడా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అతడి స్థానంలో హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు. భారత బౌలింగ్ భారాన్ని మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా మోస్తున్నారు. వీరికి ముగ్గురు స్పిన్నర్లు తోడవుతున్నారు. మొత్తంగా పేస్, స్పిన్ బౌలింగ్ కలయికతో బంగ్లాదేశ్ పై ఎటాకింగ్ చేపట్టాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు.. ఇంట్లో భాగంగానే తన నిర్ణయాన్ని అమలులో పెట్టాడు. మరి బౌలర్లు ఏం చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది..
వరుసగా 11 సార్లు..
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ ప్రక్రియలో రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు దాదాపు 11 సార్లు ఐసీసీ ట్రోఫీలలో రోహిత్ శర్మ టాస్ నెగ్గలేదు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ టాస్ నెగ్గకపోవడం వల్ల అహ్మదాబాద్ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. పేస్ బౌలింగ్ కు అనుకూలించిన ఆ మైదానంలో పరుగులు తీయడానికి భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోహిత్ వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు ఆ స్థాయిలో సత్తా చూపించలేకపోయారు. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియా ఎదుట వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ తలవంచాల్సి వచ్చింది.. ఇక టి20 వరల్డ్ కప్ లో టాస్ ఓడిపోయినప్పటికీ.. ఉత్కంఠ మధ్య టీమిండియా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పైన నెగ్గింది. అయితే బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షాంటో టాస్ నెగ్గడంతో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు పెద్దగా పరుగులు చేయలేదని.. చేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుందని.. రాత్రిపూట మంచు కురవడం వల్ల బౌలింగ్ చేసే జట్టుకు ఇబ్బంది తప్పదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ లెక్కన చూసుకుంటే రోహిత్ అదృష్టవంతుడన్నట్టే లెక్క. ఒకవేళ రోహిత్ గనుక టాస్ నెగ్గి ఉంటే కచ్చితంగా బౌలింగ్ తీసుకునేవాడు. ఆ అవకాశాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో రోహిత్ కు ఇచ్చినట్టయింది. మరి ఈ మైదానంపై భారత బౌలర్లు ఏ విధమైన ప్రతిభ చూపుతారో వేచి చూడాల్సి ఉంది. ఇక బంగ్లాదేశ్ – భారత్ ఇటీవల కాలంలో ఐదు వన్డేలు ఆడాయి. ఇందులో భారత్ రెండు, బంగ్లాదేశ్ మూడు మ్యాచ్లలో విజయం సాధించాయి.. ప్రస్తుతం జరిగే మ్యాచ్లో భారత్ గనుక విజయం సాధిస్తే సమీకరణాలు 3-3 తో సమం అవుతాయి.