https://oktelugu.com/

రోహిత్ ఎంట్రీ ఇంగ్లండ్ తో ఈరోజు టఫ్ ఫైట్

ఇంగ్లండ్ తో 5 టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ గెలిస్తే.. రెండో టీ20లో యువ జోష్ తో టీమిండియా నెగ్గింది. ఇప్పుడు కీలకమైన మూడో టీ20కి రంగం సిద్ధమైంది. ఈ టీ20 నెగ్గిన జట్టు సిరీస్ లో ముందడుగు వేస్తుంది. నెగ్గే అవకాశాలున్నాయి. దీంతో ఎలాగైనా సరే దీన్ని చేజిక్కించుకోవాలని టీమిండియా, ఇంగ్లండ్ పట్టుదలగా ఉన్నాయి. తొలి టీ20లో తేలిపోయిన భారత బౌలర్లు.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యం సంపాదించేందుకు […]

Written By: , Updated On : March 16, 2021 / 09:04 AM IST
Follow us on

ఇంగ్లండ్ తో 5 టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ గెలిస్తే.. రెండో టీ20లో యువ జోష్ తో టీమిండియా నెగ్గింది. ఇప్పుడు కీలకమైన మూడో టీ20కి రంగం సిద్ధమైంది. ఈ టీ20 నెగ్గిన జట్టు సిరీస్ లో ముందడుగు వేస్తుంది. నెగ్గే అవకాశాలున్నాయి. దీంతో ఎలాగైనా సరే దీన్ని చేజిక్కించుకోవాలని టీమిండియా, ఇంగ్లండ్ పట్టుదలగా ఉన్నాయి.

తొలి టీ20లో తేలిపోయిన భారత బౌలర్లు.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యం సంపాదించేందుకు భారత జట్టు సిద్ధమైంది. బౌలర్లు లయ అందుకోవడం.. కెప్టెన్ కోహ్లీ ఫామ్ లోకి రావడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆతిథ్య జట్టును ఇంగ్లండ్ ఆపతుందా లేదా? అన్నది చూడాలి.

రెండు మ్యాచుల్లో రోటేషన్ పద్ధతిలో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండు టీ20ల్లో సున్నాకే ఔట్ అయిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో ఆడడం కష్టమేనంటున్నారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియా ఏకంగా 2-1తో సిరీస్ లో ఆధిక్యం సంపాదించే వీలుంది. లేని పక్షంలో వరుసగా చివరి 2 టీ20లు నెగ్గాలి. అది కష్టమే. అందుకే ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా రెండు జట్లు పోరాడుతున్నాయి.

ఇక తొలి అరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టిన ఇషాన్ కిషన్ ను తీసేసే పరిస్థితి లేదు. కోహ్లీ ఫామ్ లోకి రావడం.. పంత్ 4వ స్థానంలో ఊపు మీద ఉండడం.. 5వ స్థానంలో పాండ్యా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కు కూడా మరో చాన్స్ దక్కే అవకాశం ఉంది. శ్రేయాస్అయ్యర్ నిలకడగా ఆడుతున్నాడు. దీంతో బ్యాటింగ్ లో ఒక్క రోహిత్ ను మాత్రమే మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇక బౌలర్లు వారినే కొనసాగించనున్నారు.

ఇక ఇంగ్లండ్ లో దిగ్గజాలున్నాయి. జాసన్ రాయ్ ఫామ్ లో ఉన్నాడు. ఈ స్పిన్ వికెట్ పై మొయిన్ అలీని ఆడించే అవకాశాలున్నాయి. ఎర్రమట్టితో ఉన్న స్పిన్ పిచ్ పై జరిగే ఈ టీ20 స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.