Rohit Class For Harshit Rana: క్రికెట్లో ఏ ఫార్మాట్ అయినా సరే.. ఓకే ప్రణాళికతో రంగంలోకి దిగితే విజయం దక్కదు. ముఖ్యంగా కెప్టెన్ ఎప్పటికప్పుడు తన విధానాలు మార్చుకుంటూ ఉండాలి. మైదానంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను సంసిద్ధులను చేయాలి. అవసరమైతే కొన్ని సందర్భాలలో కటువుగా ప్రవర్తించాలి. అప్పుడే అనుకూల ఫలితాలు వస్తాయి. ఇలాంటి విధానాలను అవలంబించడంలో టీమిండియా సారధిగా రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. కొన్ని సందర్భాలలో అతడి విధానాలు జట్టుకు అంతగా లాభం చేయకపోయినప్పటికీ.. మెజారిటీ సందర్భాలలో మాత్రం జట్టుకు ఎన్నో విజయాలు తీసుకొచ్చాయి. తాజాగా రోహిత్ శర్మ తీసుకున్న ఓ నిర్ణయం టీమ్ ఇండియాకు ఎంతో హెల్ప్ అయింది. అన్నింటికంటే ముఖ్యంగా గంభీర్ శిష్యుడికి ఆనందాన్ని కలిగించింది.
గౌతమ్ గంభీర్ శిష్యుడిగా హర్షిత్ రాణా పేరు పొందాడు. అతడు పెద్దగా వికెట్లు తీయలేకపోయినప్పటికీ .. వరుసగా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో విమర్శలు పెరిగిపోయాయి. దీనికి తోడు అతని బౌలింగ్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో అతడు అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. కానీ మూడో వన్డేలో మాత్రం ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. తన కెరియర్ లోనే అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. వాస్తవానికి హర్షిత్ నుంచి ఇటువంటి ప్రదర్శన వస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరికి గౌతమ్ గంభీర్ కూడా ఊహించి ఉండడు..
హర్షిత్ ఈ స్థాయిలో ప్రదర్శన చేయడానికి ప్రధాన కారణం రోహిత్. ఎందుకంటే హర్షిత్ బౌలింగ్ లో ఉన్న లోపాన్ని ఎప్పటికప్పుడు చెప్పాడు రోహిత్. ఎలాంటి దిశలో బంతులు వేయాలి.. ఇలాంటి బంతులను వేస్తే బ్యాటర్ ఇబ్బంది పడతాడు.. అనే విషయాలను అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. అంత కాదు కొన్ని సందర్భాలలో క్లాస్ కూడా పీకాడు. దీంతో రోహిత్ చెప్పినట్టుగానే హర్షిత్ బంతులు వేశాడు.
ముఖ్యంగా రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమైన మిచెల్ ఓవెన్ ను రోహిత్ తన తెలివి ద్వారా బోల్తా కొట్టించాడు. హర్షిత్ బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడికి విలువైన సలహాలు ఇచ్చాడు. రోహిత్ చెప్పినట్టుగానే హర్షిత్ బంతివేయడంతో.. దానిని స్లిప్ లోకి ఆడాలని ఓవెన్ భావించాడు. దానికి తగ్గట్టుగానే బంతి బ్యాట్ చివరి అంచుకు తగిలింది. అది కాస్త స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లో పడింది. తద్వారా ఓవెన్ ప్రస్థానం ఒక్క పరుగు వద్ద మాత్రమే ముగిసింది. ఆ బంతిని అందుకుని రోహిత్ శర్మ వన్డేలలో 100 క్యాచ్ ల ఘనత సొంతం చేసుకున్న ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు తాను ఎంతటి విలువైన ఆటగాడినో.. తన సూచనలు ఎలా ఉంటాయో మరోసారి నిరూపించాడు రోహిత్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
View this post on Instagram