Rohit : అందువల్లే ఢిల్లీలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. పైగా అక్కడ కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. గాలిలో నాణ్యత అంతకంతకు క్షీణిస్తోంది. అయినప్పటికీ నష్ట నివారణ చర్యలు అంతంతమాత్రమే సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో కాలుష్యం గురించి.. అకాల వర్షాల గురించి మాత్రమే పేపర్లో చదివే వాళ్ళం. టీవీలలో చూసేవాళ్ళం. కానీ తొలిసారిగా ఢిల్లీలో గాలి దమ్ము వ్యాపించింది. ఢిల్లీ వాసులకు చుక్కలు చూపించింది. సహజంగా ఇలాంటి గాలి దుమ్ము ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ తొలిసారిగా ఢిల్లీలో రావడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. గాలి దుమ్ముకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ గాలి దుమ్ము తీవ్రత ఎలా ఉందో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma) తన మాటల్లోనే చెప్పాడు. అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Also Read : “RO” ను కలిసిన అర్సీబీ ఆటగాడు.. ఇన్ స్టా లో ఏం పోస్ట్ చేశాడంటే..
కం బ్యాక్ కం బ్యాక్
ఢిల్లీలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అక్కడ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.. ఇక ఆదివారం ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఆదివారం రాత్రి 7:30 నుంచి మ్యాచ్ మొదలవుతుంది. అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఇటీవల ముంబై జట్టు ఢిల్లీ వెళ్ళింది. అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళగా.. గాలి, దుమ్ము విపరీతంగా వ్యాపించింది. దీంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కలగలేదు. ఫలితంగా ముంబై ఆటగాళ్లు గాలి దుమ్ము తీవ్రతను తట్టుకోలేక వేగంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి బయలుదేరారు. ఈ సమయంలో రోహిత్ శర్మ ఆ గాలి దుమ్ము నుంచి తన సహచర ఆటగాళ్లను రక్షించడానికి తాపత్రయపడ్డాడు. కం బ్యాక్ కం బ్యాక్ అంటూ అందరినీ వెనక్కి రప్పించాడు. ఇక ఇదే సమయంలో ఓ వీడియో గ్రాఫర్ రోహిత్ శర్మను వీడియో తీస్తుండగా.. అతడు వారించాడు.” నన్ను కాదు నువ్వు వీడియో తీయాల్సింది.. గాలి దుమ్మును తీయి.. కం బ్యాక్ కం బ్యాక్.. గాలి తీవ్రంగా ఉంది. ముందు మీరు వెనక్కి వచ్చేయండి. అక్కడి వాతావరణం అత్యంత ధారణంగా ఉంది. దుమ్ము, గాలి ఇబ్బంది పెడుతోంది. ముందు జాగ్రత్తగా మనం వెనక్కి వెళ్లాలంటూ” రోహిత్ శర్మ తన సహచర ఆటగాళ్లకు సూచించాడు. వారు మొత్తం వచ్చేదాకా అక్కడే ఉన్నాడు. వారితోపాటు రోహిత్ కూడా చివరికి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది.
Also Read : ఐదుసార్లు MI ని IPL విజేతగా నిలిపితే.. డ్రింక్స్ బాయ్ ని చేశారు..