Riyan Parag: క్రికెటర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. లేనిపక్షంలో కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి రాజస్థాన్ రాయల్స్ జట్టు సారధి రియాన్ పరాగ్ కు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే అతడు చేసిన తప్పు అలాంటిది మరి.
రాజస్థాన్ జట్టు ఈ ఐపీఎల్ లో మళ్లీ విజయాల బాట పట్టింది. మంగళవారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా రాజస్థాన్ జట్టు పాయింట్లు పట్టికలో తన నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.. రాజస్థాన్ జట్టు అద్భుతంగా ఆడింది. బౌలింగ్లో సత్తా చూపించలేకపోయినప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టింది. తద్వారా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
రాజస్థాన్ జట్టు విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు.. డ్రెస్సింగ్ రూమ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్(ఈ సిగరెట్ తాగడం) చేశాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం సాధారణంగా స్టేడియం, డ్రెస్సింగ్ రూమ్ లో పొగ తాగడం నిషేధం. మనదేశంలో 2019 నుంచి ఈ సిగరెట్ల విక్రయం, వాడకంపై నిషేధం ఉంది. ఈ క్రమంలో పరాగ్ ఈ సిగరెట్ తాగినట్టు వీడియోలలో కనిపించింది. ఒకవేళ అతడు నిబంధనలు మొత్తం అతిక్రమించినట్టు తెలిస్తే ఖచ్చితంగా జరిమానా పడుతుంది. లేదా ఒక మ్యాచ్లో సస్పెన్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. సిగరెట్ తాగడంలో మరింత తప్పు చేసినట్టు తేలితే జైలు శిక్ష పడుతుంది.
క్రికెటర్లకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా సారధులకు భరించలేని శిరోభారం ఉంటుంది. ఐపీఎల్ లో అన్ని జట్ల కెప్టెన్ల మీద ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. వారు ఆ ఒత్తిడిని అధిగమించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే మైదానంలో స్మోకింగ్ చేయడం నేరం. దానివల్ల ఆటగాళ్ల మీద ప్రజలకు చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అందువల్ల ఇటువంటి వ్యసనాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని పదేపదే బీసీసీ పెద్దలు చెబుతుంటారు.
మన దేశ క్రికెట్లో చాలామంది ఆటగాళ్లు వ్యసనాలకు అలవాటు పడి తమ కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకున్నారు. వినోద్ కాంబ్లీ నుంచి మొదలు పెడితే పృద్విషా వరకు అందరూ వ్యసనాలకు పాల్పడి తమ కెరియర్ ను ప్రశ్నార్థకం చేసుకున్నారు. అందువల్లే ఆటగాళ్లు వ్యసనాలకు దూరంగా ఉండాలని విశ్లేషకులు చెబుతుంటారు.
