Homeక్రీడలుక్రికెట్‌India vs South Africa Highlights: రిషి సునక్ రంగం లోకి దిగినప్పటికీ.. టీమిండియా కు...

India vs South Africa Highlights: రిషి సునక్ రంగం లోకి దిగినప్పటికీ.. టీమిండియా కు ఉపయోగం లేకుండా పోయింది..

India vs South Africa Highlights: గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. వరుస విజయాల పరంపరను అందుకోలేకపోయింది. సొంత దేశంలో జరుగుతున్న మ్యాచ్ లో చేతులెత్తేసింది. బ్యాటింగ్లో విఫలమైంది. బౌలింగ్లో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా అహ్మదాబాద్ వేదికను మరోసారి తనకు అత్యంత దురదృష్టకరమైన పిచ్ గా మార్చుకుంది..

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట్లో వికెట్లను కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. తద్వారా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బ్రేవిస్ 45 పరుగులు చేశాడు. స్టబ్స్ 44* పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిడియా బౌలర్లలో బుమ్రా మాత్రమే ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చాడు. మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అర్ష్ దీప్ సింగ్ నాలుగు ఓవర్ లు వేసి.. 28 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్లో రవి శాస్త్రి కామెంట్రీ సెక్షన్లో కూర్చున్నాడు. అతడితోపాటు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా ఆసీనులయ్యారు. ఆయన టీమిండియా ఆట తీరు గురించి పదేపదే గొప్పగా చెప్పారు. కానీ ఆ స్థాయిలో టీమిండియా ప్లేయర్లు ఆడలేదు. క్రికెట్ తాను ఎందుకు చూస్తాను.. టీమిండియా ప్లేయర్లు ఆడుతుంటే ఎందుకు ఆస్వాదిస్తాను.. సొంత ఇష్టమైన ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆడుతుంటే ఎందుకు అంతగా ఆసక్తి కలిగించదు.. అనేక విషయాలపై రిషి సునాక్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. భావోద్వేగంగా మాట్లాడినప్పటికీ.. టీమిండియా ప్లేయర్లు ఆకట్టుకోలేకపోయారు.

” రవి శాస్త్రి ఎలాగు టీమిండియా ప్లేయర్లకు అనుకూలంగా మాట్లాడుతుంటారు. టీమ్ ఇండియా ప్లేయర్ల గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ ఈసారి ఆయనకు రిషి సునాక్ కూడా జతయ్యారు. కానీ, ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా టీమిండియా ప్లేయర్లు వినియోగించుకోలేకపోయారు. ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రిషి సునాక్ మైక్ అందుకోవడమే ఆలస్యం.. అహ్మదాబాద్ మైదానంలో కూర్చున్న వేలాదిమంది అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. టీమిండియా ఆటగాళ్ల గొప్పతనం గురించి.. వారు ఆడుతున్న తీరి గురించి గొప్పగా చెప్పారు. అయినప్పటికీ టీమిండియాకు ఉపయోగం లేకుండా పోయింది. ఆటగాళ్లు సరిగా ఆడలేక పోవడంతో అటు అభిమానులు.. ఇటు రిషి సునాక్ నిరాశకు గురయ్యారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version