Homeఎంటర్టైన్మెంట్Pradeep Ranganathan New Movie: బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో ప్రదీప్ రంగనాథన్..ఈసారి 300...

Pradeep Ranganathan New Movie: బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో ప్రదీప్ రంగనాథన్..ఈసారి 300 కోట్లు టార్గెట్!

Pradeep Ranganathan New Movie: తమిళనాడు లో ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ‘కోమలి’ అనే చిత్రం తో డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈయన , మొదటి సినిమాతోనే భారీ హిట్ ని అందుకున్నాడు . ఆ తర్వాత ఈయన స్వీయ దర్శకత్వం లో ‘లవ్ టుడే’ అనే చిత్రం లో హీరో గా నటించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తర్వాత ఆయన అశ్వత్ మారిముత్తు దర్శకత్వం లో ‘డ్రాగన్’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అంతే కాదు ఈ చిత్రం తర్వాత ప్రదీప్ రంగనాథన్ తమిళనాడు యూత్ కి ఐకాన్ లాగా మారిపోయాడు. ఆయన నుండి ఒక సినిమా వతుంది అంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకాన్ని జనాల్లో కలిగించాడు . అయితే యూట్యూహ్ ఆడియన్స్ కి ‘డ్రాగన్’ చిత్రం ఒక ఎమోషన్. వాళ్లకు తమని తాము వెండితెర పై చూసుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ చిత్రం. ఇలాంటి సినిమాలు కేవలం ఒక్క పార్ట్ తో ఆగిపోకూడదు , ఒక ఫ్రాంచైజ్ లాగా రావాలని కోరుకునే వారు. వాళ్ళ కోరికకు తగ్గట్టే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకొని వెళ్ళబోతున్నాడట డైరెక్టర్ అస్వత్. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు సీక్వెల్ ని తీసే ఆలోచన ఉందని విడుదలైన కొత్తల్లోనే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను .

త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకుని రాబోతున్నాను. స్క్రిప్ట్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక హీరో కి వినిపించడమే బ్యాలన్స్ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ఈ సీక్వెల్ ని మొదటి భాగం తో సమానంగా అద్భుతంగా తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి భాగం లో హీరో తన తప్పుని తెలుసుకొని , ఫేక్ ఉద్యోగాన్ని వదిలేసి జైలుకి వెళ్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తూ , బీటెక్ లో మరోసారి జాయిన్ అవుతాడు. అప్పుడు అతని HOD హీరో నిజాయితీని మెచ్చి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధం అవుతాడు. హీరో కూడా అందుకు ఒప్పుకుంటాడు , ఆ తర్వాత ఏమి జరగబోతుంది అనేది సీక్వెల్ లో చూడాలి .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని...
Oktelugu Epaper
Exit mobile version