Homeఎంటర్టైన్మెంట్Priyanka Chopra Sensational Comments: ఒత్తిడికి గురయ్యా..అందుకే బాలీవుడ్ ని వదిలేశాను అంటూ ప్రియాంక చోప్రా...

Priyanka Chopra Sensational Comments: ఒత్తిడికి గురయ్యా..అందుకే బాలీవుడ్ ని వదిలేశాను అంటూ ప్రియాంక చోప్రా హాట్ కామెంట్స్ !

Priyanka Chopra Sensational Comments: తమిళ సినిమా వార వెండితెర అరంగేట్రం చేసి , ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగి , ఇప్పుడు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి , వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయిన హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అలా హాలీవుడ్ నటిగా మారిపోయిన ప్రియాంక చోప్రా, భారీ గ్యాప్ తర్వాత చేస్తున్న ఇండియన్ చిత్రం ‘వారణాసి'(Varanasi Movie). సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులను చూస్తే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అవుతుందట. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తానూ బాలీవుడ్ ని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను బాలీవుడ్ ని కావాలని వదిలి వెళ్ళలేదు. అక్కడ సినిమాలు చేస్తున్నప్పుడు ఎందుకో నేను ఒక పరిమితి దగ్గర ఆగిపోయాను , నా మార్కెట్ ని విస్తరింపచేసుకోవాలని అనుకున్నాను , అందుకే హాలీవుడ్ లోకి అడుగుపెట్టాను. బాలీవుడ్ లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో, నేను ఏ ఇండస్ట్రీ లో ఉండాలి అనే నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఒత్తిడికి గురయ్యాను. చివరికి హాలీవుడ్ లోనే స్థిరపడాలని నిర్ణయించుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాను. కానీ నాకు ఇండియన్ సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ లో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోకి ‘ది క్వాన్టికో’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వడంతో ప్రియాంక చోప్రా కి హాలీవుడ్ లో మంచి ఫేమ్ వచ్చింది .

ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘బే వాచ్’ అనే హాలీవుడ్ యాక్షన్ చిత్రం ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ప్రియాంక చోప్రా కి హాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా హీరోయిన్ గా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో హాలీవుడ్ సినిమాలు చేస్తూ టాప్ ఆర్టిస్టుగా మారిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఆమె ‘ది బ్లఫ్’ అనే హాలీవుడ్ చిత్రం లో నటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25 న అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫుల్ బిజీ గా ఉంది.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని...

Cockroach Janata Party : ఎగతాళి నుంచి పుట్టి.. ఎదురొడ్డి పోరాడి..

Cockroach Janata Party : ఇటీవలి కాలంలో భారత రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించింది. సంప్రదాయ పార్టీలను అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు కోట్ల మంది అనుచరులను సంపాదించుకున్న కాక్రోచ్‌ జనతా పార్టీ...
Oktelugu Epaper
Exit mobile version