Rishabh Pant: అలవోకగా సిక్సర్లు కొట్టే రిషబ్ పంత్.. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేడా?

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో రిషబ్ పంత్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ అతని ఆట బాగోలేదు. ఇదేమి ఐపీఎల్ కాదు. టి20 వరల్డ్ కప్ అంతకన్నా కాదు. అందువల్లే అతడు నిర్లక్ష్యంగా ఆడాడు. స్పిన్ బౌలింగ్ లో తీవ్రమైన ఇబ్బంది పడ్డాడు. వచ్చేయడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అందులో ఎలా ఆడతాడో చూడాల్సి ఉందని" మరో నెటిజన్ పేర్కొన్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 18, 2024 9:55 pm

Rishabh pant

Follow us on

Rishabh Pant: : రోడ్డు ప్రమాదం బారిన పడి.. దీర్ఘకాలం మంచానికే పరిమితమై.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. ఐపీఎల్ లో సత్తా చాటాడు. టి20 వరల్డ్ కప్ లో వారెవ్వా అనిపించాడు.

ఢిల్లీలో ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరుతో టి20 టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రిషబ్ పంత్ కు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సన్మానం చేసింది. వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ విజేతగా నిలిచింది. భారత జట్టులో రిషబ్ పంత్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో డి డి సి ఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ, డిసిసి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా రిషబ్ పంత్ ను సన్మానించిన వారిలో ఉన్నారు.

రిషబ్ పంత్ పురాని ఢిల్లీ -6 జట్టుకు నాయకత్వం వహించాడు. 32 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతడు పేస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. కానీ స్పిన్ బౌలింగ్ లో మాత్రం తేలిపోయాడు. స్పిన్ బౌలర్లు వేసిన బంతులను ఆడటంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు . దీంతో సోషల్ మీడియాలో రిషబ్ పంత్ పై విమర్శలు మొదలయ్యాయి. ” భారీ స్కోర్ చేస్తావని ఆశిస్తే ఇలా చేశావ్ ఎందుకని” అభిమానులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

” రిషబ్ పంత్ గ్రేట్ ప్లేయర్. అతడు మ్యాచ్ విన్నర్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లోనూ అతడు మ్యాచ్ విన్నర్ గా ఆవిర్భవిస్తాడని భావించాం. కాని క్షేత్రస్థాయిలో అతడు అలా ఆడలేదు. టి20 క్రికెట్లో 30 బంతులు ఎదుర్కొన్న అతడు.. స్ట్రైక్ రేట్ దారుణంగా నమోదు చేశాడు. పది బంతుల్లో 25 పరుగులు చేస్తే బాగుండేది. కానీ అలాంటి ప్రదర్శన అతడు చేయలేదు” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

” ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో రిషబ్ పంత్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ అతని ఆట బాగోలేదు. ఇదేమి ఐపీఎల్ కాదు. టి20 వరల్డ్ కప్ అంతకన్నా కాదు. అందువల్లే అతడు నిర్లక్ష్యంగా ఆడాడు. స్పిన్ బౌలింగ్ లో తీవ్రమైన ఇబ్బంది పడ్డాడు. వచ్చేయడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అందులో ఎలా ఆడతాడో చూడాల్సి ఉందని” మరో నెటిజన్ పేర్కొన్నాడు.

” రిషబ్ పంత్ ఆట తీరు నాకు నచ్చలేదు. స్పిన్ బౌలింగ్ లో దారుణంగా ఆడాడు.. ఢిల్లీ లీగ్ లో ఇది మరోసారి నిరూపితమైందని” ఓ క్రికెట్ అభిమాని వ్యాఖ్యానించాడు.

బ్యాటింగ్ లో అంతంతమాత్రంగా రాణించిన రిషబ్ పంత్.. ఈ లీగ్ లో తొలిసారి బంతి అందుకున్నాడు. పురాని ఢిల్లీ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ జట్టు.. 19 ఓవర్లకు 197/7 సాధించింది. ఈ క్రమంలో పంత్ బౌలింగ్ వేశాడు. పంత్ వేసిన తొలి బంతికి సింగిల్ తీసి.. సౌత్ ఢిల్లీ జట్టు గెలుపును సొంతం చేసుకుంది.