spot_img
Homeక్రీడలుక్రికెట్‌Rishabh Pant Vintage Performance Uppal Stadium: ఉప్పల్ లో వింటేజ్ రిషబ్ పంత్.. సంజీవ్...

Rishabh Pant Vintage Performance Uppal Stadium: ఉప్పల్ లో వింటేజ్ రిషబ్ పంత్.. సంజీవ్ గోయంకా కు నోటి మాట రాలేదు

Rishabh Pant Vintage Performance Uppal Stadium: బ్యాటింగ్ సరిగ్గా లేదు. కీపింగ్ కూడా తన స్థాయిలో లేదు. ఆటగాళ్లతో ఎలాంటి ప్రదర్శన చేయించాలో అర్థం కావడం లేదు. బౌలింగ్ కూర్పు సరిగా లేదు. బ్యాటింగ్ సరే సరి.. సీన్ కట్ చేస్తే ఓటములు.. దీంతో లక్నో ఓనర్ ఇటీవల రిషబ్ పంత్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ఆడితే ఎలా అంటూ మండిపడ్డాడు.

సహజంగా రిషబ్ పంత్ లో ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందువల్లే మాట అంటే పడడు. తనను అనేసి మాటలు అన్న సంజీవ్ కు గట్టిగా రిప్లై ఇద్దామని అనుకున్నాడు. ఆరోజు రానే వచ్చింది. తన వింటేజ్ రూపం ఎలా ఉంటుందో.. తను మనసు పెడితే మైదానంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూపించాడు.. రిషబ్ విశ్వరూపం ముందు సంజీవ్ చిన్నబోయాడు. కనీసం అతని నోటివెంట మాటలు కూడా రాలేదు. ఎందుకంటే ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ జట్టును 300 కాదు కదా.. కనీసం 200 కూడా చేయనివ్వలేదు. 156 పరుగులకే హైదరాబాద్ జట్టును ముగించాడు.

మహమ్మద్ సిరాజ్.. దిగ్వేష్.. ప్రిన్స్ యాదవ్.. ఆవేష్ ఖాన్ ఇలా నలుగురు బౌలర్లతో హైదరాబాద్ జట్టు కు చుక్కలు చూపించాడు పంత్. అంతేకాదు.. అత్యంత ప్రమాదకరమైన క్లాసెన్, లివింగ్ స్టోన్ క్యాచ్ లు పట్టి సంచలనం సృష్టించాడు. వికెట్ల వెనుక అడ్డుగోడల మాత్రమే కాదు.. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించి హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా లివింగ్ స్టోన్ క్యాచ్ అందుకున్న తీరు ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్. క్లాసెన్ క్యాచ్ పట్టి తనలో ఉన్న మాస్ ను చూపించాడు పంత్.

ఈ మ్యాచ్ గెలవడం రిషబ్ పంత్ కు అత్యంత అవసరం. ఎందుకంటే అతడు సారధిగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. పైగా లక్నో ఓనర్ సంజీవ్ ప్రతి మ్యాచ్లో కూడా ప్రింటర్ ఫియర్ అవుతున్నాడు. మ్యాచ్ ఓడిపోతే చాలు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి.. పంత్ కు క్లాస్ పీకి వెళ్తున్నాడు. ఇది సహజంగానే అతడికి నచ్చడం లేదు. అందువల్లే సంజీవ్ మాటలకు తన చేతల ద్వారా కౌంటర్ ఇస్తున్నాడు. సంజీవ్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ఇటీవల ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిని ఒక లూజర్ అని.. జోకర్ అని అభివర్ణించాడు. అయినప్పటికీ సంజీవ్ తన ధోరణి మార్చుకోలేదు. మార్చుకునే వ్యక్తి కూడా కాదు. అందువల్లే పంత్ తన విశ్వరూపం చూపించాడు. ఇప్పట్లో సంజీవ్ రిషబ్ పంత్ ను మందలించే అవకాశం లేదు. ఎందుకంటే ఉప్పల్ లో పంత్ కెప్టెన్సీ అలా ఉంది మరి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper