Homeక్రీడలుRishabh Pant meditation photos: రిషబ్ పంత్.. మెడిటేషన్ లో కూడా ఇంతటి స్వాగా?!

Rishabh Pant meditation photos: రిషబ్ పంత్.. మెడిటేషన్ లో కూడా ఇంతటి స్వాగా?!

Rishabh Pant meditation photos: టీమిండియా క్రికెట్లో రిషబ్ పంత్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే అతను ఆడుతుంటే క్రికెట్ లో కొత్త కొత్త షాట్ ల గురించి రాయాల్సి ఉంటుంది. శరీరాన్ని 360 డిగ్రీల కోణంలో వంచి బ్యాటింగ్ చేయగలడు. పడుకొని కూడా సిక్సర్లు కొట్ట గలడు. అవసరమైతే బంతిని స్టాండ్స్ అవతలికి పంపించగలడు.

గంటలసేపు మైదానంలో ఉండడం అతనికి విపరీతమైన బోరింగ్. ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.. అందువల్లే ఫార్మాట్ తో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. మైదానంలో విధ్వంసాన్ని చూపిస్తాడు.. ప్రత్యర్థి బౌలర్లకు పరాక్రమం అంటే ఎలా ఉంటుందో లైవ్లో కనిపించేలా చేస్తాడు.

రిషబ్ పంత్ ఫాం ను పట్టించుకోడు. బౌలర్ ఎవరనేది లెక్క పెట్టడు. మైదానం ఎలాంటిదనేది చూసుకోడు. జస్ట్ ఒక్కసారి బ్యాట్ పట్టుకున్నాడా.. ఇక ఊచకోత మొదలైనట్టే. వేగంగా పరుగులు తీస్తూ ఉంటాడు. వికెట్ల మధ్య సుడిగాలి మాదిరిగా పరుగులు పెడుతూ ఉంటాడు. ఉన్నంతసేపు ధనాధన్ బ్యాటింగ్ చేసి.. సంచలనానికే సంచలనం సృష్టించి వెళ్తాడు.

రిషబ్ పంత్ కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదాన్ని గురయ్యాడు. చాలా కాలం పాటు క్రికెట్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ టూర్ లో ఉన్నప్పుడు గాయపడిన అతడు.. కొద్దిరోజులు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇటీవల కూడా గాయపడిన నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

బ్యాటింగ్ లో .. వికెట్ కీపింగ్ లో డిఫరెంట్ మేనరిజం ప్రదర్శించే రిషబ్ పంత్.. చివరికి విశ్రాంతి తీసుకున్న విషయంలో కూడా అదే స్థాయిని ప్రదర్శిస్తున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో.. పచ్చని గడ్డి కింద.. చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. బ్యాటింగ్లో మాత్రమే కాదు.. వికెట్ కీపింగ్ లో నూ రిషబ్ పంత్ సంచలనమే. చివరికి విశ్రాంతి తీసుకొనే విషయంలో కూడా విభిన్న తత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని అభిమానులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version