Homeక్రీడలుక్రికెట్‌Rishabh Pant : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!

Rishabh Pant : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!

Rishabh Pant  : ఐపీఎల్ లో భారీ ధర పలికిన ఆటగాడు కచ్చితంగా ఆడాల్సిందే. అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకోవాల్సిందే. లేకపోతే విమర్శలు వస్తుంటాయి. ఆరోపణలు వినిపిస్తుంటాయి. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడిన స్టార్క్.. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఆ సీజన్లో అతడు ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దానికంటే ముందు మ్యాచ్లలో దారుణంగా విఫలమయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు కాబట్టి స్టార్క్ బతికిపోయాడు. లేకుంటే నా అతని పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు తట్టుకోలేక.. నవరంద్రాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది.

Also Read : అరేయ్ బుడ్డోడా.. ఇలాగైతే కెరియర్ అస్సాం చేరుకున్నట్టే..

ఇక ఇప్పటి సీజన్లో…

ఇక ఇప్పటి సీజన్లో 27 కోట్ల ధర పలికి మోస్ట్ కాస్ట్లీ ప్లేయర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. లక్నో జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. సహజంగా ఎడమ చేతి వాటం బ్యాటింగ్ తో ఆకట్టుకునే రిషబ్ పంత్.. ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు.. పది ఇన్నింగ్స్ లలో అతడు చేసిన పరుగులు మొత్తం 128 మాత్రమే అంటే.. అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యావరేజ్ 12.8, స్ట్రైక్ రేట్ 99.22 గా ఉందంటే రిషబ్ పంత్ ఎంత చెత్తగా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానాలతో సంబంధం లేకుండా.. బౌలర్లతో సంబంధం లేకుండా.. పరుగుల వరద పారించే సామర్థ్యం పంత్ సొంతం. కానీ ఈ సీజన్లో అతడు ఎందుకు విఫలమవుతున్నాడో అర్థం కావడం లేదు. చివరికి ఆదివారం నాటి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోను అతడు దారుణంగా విఫలమయ్యాడు.. 18 పరుగులు చేసి.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. కీలకమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉన్నప్పుడు.. బ్యాట్ ఎత్తేసాడు. నిర్లక్ష్యపూరితమైన షాట్ కొట్టి వికెట్ పారేసుకున్నాడు. కాస్త సమయమనంతో బ్యాటింగ్ చేసి ఉంటే.. బలమైన ఇన్నింగ్స్ నిర్మించి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ ఏమాత్రం ఓపిక లేక.. నిలబడాలి అనే సోయి కూడా లేక.. రిషబ్ పంత్ విఫలమయ్యాడు. అతడు అవుట్ కావడం వల్ల లక్నో జట్టు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంది. ఆయుష్ బదోని.. అబ్దుల్ సమద్.. వంటి వారు కాస్త నిలబడటం వల్ల లక్నో జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కీలకమైన ప్లే ఆఫ్ దశలో లక్నో జట్టు ఇలా ఓడిపోవడం.. నిజంగా అత్యంత దారుణం. ఇక రిషబ్ పంత్ నిర్లక్ష్యపూరితమైన ఆట తీరు ఆ జట్టుకు ప్రతిబంధకంగా నిలుస్తోంది. ఒకవేళ రిషబ్ పంత్ ఇలాగే ఆడితే మాత్రం.. అతని కూడా కేఎల్ రాహుల్ లాగా వచ్చే సీజన్ కు వేరే జట్టును చూసుకోవాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version