Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Royals : ఆ ఒక్క పరుగు చేసి ఉంటే.. రాజస్థాన్ రాజసం నిలబడేది..

Rajasthan Royals : ఆ ఒక్క పరుగు చేసి ఉంటే.. రాజస్థాన్ రాజసం నిలబడేది..

Rajasthan Royals: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో సీట్ ఎడ్జ్ మ్యాచులు చాలా జరిగాయి. గ్రూప్ దశ ముగుస్తుందనుకుంటున్న తరుణంలో కొన్ని మ్యాచ్లు ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మించి ఉత్కంఠను కలుగజేస్తున్నాయి. చేతుల గోర్లు కొరికేలా.. సీట్ ఎడ్జ్ చివరన కూర్చుని చూసేలా చేస్తున్నాయి. శనివారం చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఇలాంటి అనుభూతిని ఇవ్వగా.. ఆదివారం కోల్ కతా, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా అంతకుమించిన అనుభూతిని అందించింది. చివరికి ఒక్క పరుగు రాజస్థాన్ జట్టులో విచారాన్ని..కోల్ కతా జట్టులో ఆనందాన్ని నింపింది. అయితే పోటీపరంగా.. పోరాటపరంగా.. సత్తాపరంగా.. సామర్థ్యంపరంగా రెండు జట్లు హోరాహోరీగా పోరాడినప్పటికీ.. చివరికి విజయం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును వరించింది. కీలకమైన ప్లే ఆఫ్ దశకు ముందు గెలవడం కోల్ కతా జట్టుకు 1000 ఏనుగుల బలాన్ని అందించింది. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయిన రాజస్థాన్.. గెలుపు ముందు బోల్తా పడి.. పరువు కోల్పోయింది.

Also Read : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!

ఒక్క పరుగు వ్యత్యాసంతో..

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి.. 4 వికెట్లు లాస్ అయిపోయి.. 206 రన్స్ చేసింది. ఆండ్రి రస్సెల్ వీరొచిత బ్యాటింగ్ కోల్ కతా నైట్ ఈ జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమైంది. ఇక రాజస్థాన్ జట్టులో రియాన్ పరాగ్ 95 రన్స్ తో దుమ్మురేపినప్పటికీ.. కీలకమైన దశలో అతడు అవుట్ కావడంతో రాజస్థాన్ జట్టు ఓడిపోవాల్సి వచ్చింది.. యశస్వి జైస్వాల్, సిమ్రాన్ హిట్ మేయర్ లాంటివారు ఇంకాసేపు క్రీజ్ లో ఉండి ఉంటే రాజస్థాన్ జట్టు కచ్చితంగా గెలిచేది. చివర్లో శుభం దుబే మెరుపు లెవెల్ లో బ్యాటింగ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రాజస్థాన్ విక్టరీ సాధించాలంటే లాస్ట్ ఓవర్లో 22 రన్స్ కావాలి.. శుభం దుబే తొలి మూడు బంతుల్లో 16 పరుగులు పిండుకున్నాడు. లాస్ట్ బాల్ కు 3 రన్స్ కావలసిన సందర్భంలో.. నాన్ స్ట్రైకర్ ఆర్చర్ బలంగా పరిగెత్త లేక రన్ అవుట్ అయ్యాడు. ఫలితంగా రాజస్థాన్ ఒక్క పరుగు వ్యత్యాసంతో కోల్ కతా ముందు తలవంచాల్సి వచ్చింది. ఈ ఓటమి ద్వారా రాజస్థాన్ తన రాజసాన్ని కోల్పోయింది. అంతేకాదు అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఒకానక దశలో కీలకమైన వికెట్లు వెంటనే కోల్పోయినప్పటికీ.. రాజస్థాన్ ప్లేయర్లు తీవ్రమైన పట్టుదల ప్రదర్శించారు. కోల్ కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కష్టం అనుకున్న లక్ష్యాన్ని కాస్త కాళ్ల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు.. కానీ చివర్లో చేతులెత్తేశారు.

Also Read : అరేయ్ బుడ్డోడా.. ఇలాగైతే కెరియర్ అస్సాం చేరుకున్నట్టే..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version