Rishabh Pant: T20 వరల్డ్ కప్ కోసం టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అమెరికా చేరుకున్నాడు. 2022, డిసెంబర్ లో అగ్ని ప్రమాదానికి గురైన ఆయన కోలుకునేందుకు ఎక్కువ సమయమే పట్టింది. మెల్ల మెల్లగా ఫామ్ ను పెంచుకొని తిరిగి ఐపీఎల్-2024 లోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్ కు కేప్టెన్ గా మంచి ప్రదర్శన ఇచ్చిన పంత్ T20 వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకున్నాడు. అయితే, T20 వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ ఎలా రాణిస్తాడనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇటీవల ఆయన జియో సినిమాలో శిఖర్ ధావన్ కొత్త టాక్ షో ‘ధావన్ కరేగా’లో మాట్లాడారు. తన చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి విషయాలు, తన తల్లిదండ్రుల కలలు, ప్రస్తుతం ఫామ్ గురించి ఆయన ధావన్ కరేగాలో నోరు విప్పాడు.
రూ. 14 వేల బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
ధావన్ కరేగాలో ధావన్ తో పంత్ మాట్లాడుతూ తన తల్లి తనపై కోపంగా ఉందని చెప్పాడు. తనకు క్రికెట్ పై ఇంట్రస్ట్ ఉందని తెలుసుకున్న తన తండ్రి తనకు రూ. 14 వేల ఖరీదైన బ్యాట్ బహుమతిగా ఇచ్చాడని, కానీ ఈ విషయం తన తల్లికి కోపం తెప్పించిందని పంత్ మనసు విప్పాడు.
అప్పుడే తాను మంచి క్రికెటర్ కావాలని తన తండ్రి కోరుకునేవాడని చెప్పాడు. తాను క్రికెటర్ కావాలనేది తన తండ్రి చిరకాల కల అని, దాన్ని నెరవేర్చగలిగినందుకు సంతోషంగా ఉందని పంత్ చెప్పుకచ్చాడు. ‘నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు క్రికెటర్ కావాలని అనుకున్నా.. ఆ విషయం అప్పుడు చెప్తే మా నాన్న చాలా కాలం తర్వాత నాకు రూ.14,000 విలువైన బ్యాట్ కొనిచ్చారు. కానీ, అంత విలువైన బ్యాట్ ఎందుకని మా అమ్మ కోపంగా ఉంది.
పంత్ పై ధావన్ ఫైర్..
దేశవాళీ జట్టులోకి ఢిల్లీ జట్టు నుంచి వచ్చిన ధావన్, పంత్ అంతర్జాతీయ స్థాయిలో కలిసే ఆడారు. ఇద్దరూ తాము ఢిల్లీ జట్టుకు ఆడిన రోజులను, అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ధావన్ పంత్ పై ఎందుకు కోపం పెంచుకున్నాడో చెప్పాడు. ‘సౌతాఫ్రికాలో జరిగిన మ్యాచ్ లో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాను. పంత్ నన్ను కొంచెం దూరంగా వెళ్లమని కోరాడు. కానీ బౌలర్ నన్ను అక్కడ నిలబడమని కోరాడని నేను అతనికి చెప్పాను. అదే సమయంలో పంత్ చెబుతున్న చోటికి వెళ్లాలని బౌలర్ మళ్లీ కోరడంతో అయోమయానికి గురై నేను ఎక్కడ నిలబడాలో రిషబ్ వైపు చూశాను. అతను నా వైపు చూశాడు తర్వాత నన్ను పట్టించుకోలేదు కాబట్టి నాకు కొంచెం కోపం వచ్చింది. ఆ తర్వాత ఆయనతో కొన్ని రోజులు మాట్లాడలేదు.