Rishabh Pant Car Accident : ఇప్పటికే ఫాం కోల్పోయి టీమిండియాలో చోటు కోల్పోయిన క్రికెటర్ రిషబ్ పంత్ కు టైం బాగాలేనట్టు ఉంది. ఆయనను శని వెంటాడుతోంది. తాజాగా మరో భారీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన రెయిలింగ్ ను ఢీకొని మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
భారత క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. రిషబ్‌ను హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. అతడికి ప్లాస్టిక్ సర్జరీ అక్కడే చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
రిషబ్ పంత్ నుదుటిపైన, కాలికి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని, అతడిని రూర్కీ నుంచి ఢిల్లీకి రిఫర్ చేస్తున్నట్లు సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు. అక్కడ అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేయనున్నారు.
BREAKING: CRICKETER RISHABH PANT CAR CRASH
Rishabh Pant Injured As His Car Collides With Divider In Uttarakhand.
Pant's car catches fire after the accident. Incident happened while he was travelling from Uttarakhand to Delhi.#RishabhPant #Pantcarcrash #pantaccident #pantinjured pic.twitter.com/MlJ50gptN4— shashank singh (@shashank_singh2) December 30, 2022
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రిషబ్ కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది, ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద మంటలు అదుపులోకి వచ్చాయి. అదే సమయంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రిలో చేర్పించారు.
పంత్ తన బిఎమ్‌డబ్ల్యూ కారును నడుపుతున్నాడని, అది ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురైందని ప్రాథమిక నివేదికలు తెలిపాయి.
-ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ కారు పూర్తిగా దగ్ధమైంది
ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రయాణిస్తున్న క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అందులోనే రిషబ్ పంత్ కనుక ఉండుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది.దీనిపై కొందరు సోషల్ మీడియా వినియోగదారులు స్పందించారు. ” ఓ వై గాడ్.. రిషబ్ కు పెద్ద ప్రమాదం తప్పింది.. త్వరగా కోలుకోండి” , “అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అతను బాగుంటాడని నేను ఆశిస్తున్నాను” అని కాంమెంట్స్ చేస్తున్నారు.
#RishabhPant got in an accident traveling from Delhi to roorkee pic.twitter.com/1AVeKWr7Hu
— cricket_for_life (@bannerman165) December 30, 2022
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More