Hardik Pandya Fastest Fifty: మైదానంలోకి రావడమే ఆలస్యం… ఒకటే కొట్టుడు.. వెనకడుగు వేసేది లేదు.. బంతి వైపు చూసేది లేదు. వీరవిహారం.. పెను విధ్వంసం… పరాక్రమం ఇలా ఏ స్థాయిలో ఉపోద్ఘాతం రాసినప్పటికీ అవి అతడి ఇన్నింగ్స్ ముందు దిగదుడుపే. ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే తిరుగు ఆడాడు. తద్వారా అహ్మదాబాద్ మైదానంలో టీమిండియా కు భారీ స్కోరును అందించాడు.
టీమ్ ఇండియా స్కోర్ 115 పరుగుల వద్ద సూర్య కుమార్ యాదవ్ (5) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది.. ఆ సమయంలో మైదానంలోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. రావడమే ఆలస్యం పరుగుల వరద పారించాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి అహ్మదాబాద్ మైదానాన్ని షేక్ చేశాడు. 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా 63 పరుగులు చేశాడు.. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. తిలక్ వర్మ కూడా 42 భక్తులు ఎదుర్కొని 73 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా దూకుడు వల్ల టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది.
తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా నాలుగో వికెట్ కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అది కూడా కేవలం 44 బంతుల్లోనే. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డులను సృష్టించాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా టి20 లలో టీమిండియా తరఫున రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ ముందున్నాడు. 2007 t20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు మీద 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ ఈ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా కంటే ముందు అభిషేక్ శర్మ రెండో స్థానంలో ఉండేవాడు. 2025లో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 17 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. అయితే అతడిని హార్దిక్ పాండ్యా వెనక్కి నెట్టి రెండవ స్థానంలోకి వచ్చాడు. అభిషేక్ శర్మ తర్వాత నాలుగో స్థానంలో కె.ఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. 2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.. కేఎల్ రాహుల్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో గౌహతి వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
HARDIK PANDYA – THE BOX OFFICE IN T20I. pic.twitter.com/tYxXOBcQh6
— Johns. (@CricCrazyJohns) December 19, 2025